తహసిల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు

తహసిల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు

తహసిల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు 
 
అక్షరదర్బార్, హనుమకొండ: వరంగల్ జిల్లా ఖిలావరంగల్ తహసిల్దార్ బండి నాగేశ్వర్ రావు ఇంటిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు చేశారు. హనుమకొండ ప్రశాంత్ నగర్ లోని ఆయన ఇంటిపై వరంగల్ ఏసీబీ అధికారులు ఉదయం నుంచి సోదాలు జరుపుతున్నారు. తహసిల్దార్ నాగేశ్వరరావు సొంత జిల్లా ఖమ్మంలో సైతం ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. బండి నాగేశ్వర్ రావు గతంలో ధర్మసాగర్, కాజీపేట, హసన్ పర్తి మండలాల్లో తహసిల్దారుగా పనిచేశారు. ఆ సమయంలో ఆయనపై ఆరోపణలు వచ్చినట్లు తెలిసింది.‌ ఈ నేపథ్యంలో ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టినట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags:

పరకాలకు పారిశుధ్య ముప్పు

  పరకాలకు పారిశుధ్య ముప్పు వర్షాల వేళ వార్డుల్లో పేరుకుపోతున్న చెత్త..  స్వైర విహారం చేస్తున్న పందులు..  దుర్వాసనతో ప్రజల అవస్థలు..  అక్షరదర్బార్,పరకాల:వర్షాకాలంలో పరకాల పట్టణంలో పారిశుధ్య...
Read More...
పరకాలకు పారిశుధ్య ముప్పు

పీడీఎస్ రైస్ పట్టివేత

- 62 బస్తాల బియ్యం స్వాధీనం - టాస్క్‌ఫోర్స్ దాడిలో అక్రమ నిల్వ బట్టబయలు
వార్తలు 
Read More...
పీడీఎస్ రైస్ పట్టివేత

ఏసీబీ వలలో తహశీల్దార్

- చేర్యాల తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు - రూ.70 వేల లంచంతో పట్టుబడిన తహశీల్దార్ 
క్రైమ్ 
Read More...
ఏసీబీ వలలో తహశీల్దార్

గోదావరి జలాలను వృదా చేయొద్దు

- వెంటనే కన్నెపల్లి మోటార్లు ప్రారంభించాలి- లేకపోతే 50 వేల మంది రైతులతో వచ్చి పంప్‌హౌస్‌ను మేమే ఆన్ చేస్తాం- కేసీఆర్‌కు వారం రోజులు...
వార్తలు 
Read More...
గోదావరి జలాలను వృదా చేయొద్దు

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ అధ్యక్షుడిగా నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా పంచమనేని భాస్కరరావు అక్షరదర్బార్,నడికూడ: నడికూడ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మండల జర్నలిస్టుల...
Read More...
నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ