నాగారం రైతుల యూరియా... బంధువులకు బహుమతి!

నాగారం రైతుల యూరియా... బంధువులకు బహుమతి!


నాగారం రైతుల యూరియా... బంధువులకు బహుమతి!

ఏఈఓ కాటం రాజు వ్యవహారం. 

అక్షర దర్బార్, పరకాల:
హనుమకొండ జిల్లా నాగారం క్లస్టర్ పరిధిలోని
వ్యవసాయానికి అవసరమైన యూరియా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ నాగారం ఏఈఓ కాటం రాజు మాత్రం రైతుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ తన బంధువులకు కమలాపూర్ మండలానికి యూరియా బస్తాలు పంపించాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక సమాచారం ప్రకారం, రైతులకు రేషన్ చేసే యూరియాలో నుంచి దాదాపు  08 బస్తాలు తన బంధువుల కోసం కమలాపూర్ మండలం శనిగరం పంపించడంతో రైతులు ఆ వెహికల్ ని వెంబడించి నడికూడలో పట్టుకున్నారు. ఈ చర్యపై రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు."గ్రామానికి చెందిన రైతులకు బస్తాలు ఇవ్వాలంటే రూల్స్ అంటాడు. కాలు మొక్కిన బస్తాలు ఇయ్యనని  తన బంధువులకి ఇచ్చేటప్పుడు ఆ రూల్స్ అతనికి గుర్తుకు రావటంలేదని కనిపిస్తోంది," అని మండిపడ్డారు నాగారం రైతు బొజ్జం తిరుపతి."రైతుల కోసం రాసిన యూరియా... అధికారుల బంధుత్వ బంధాలలో చిక్కుకుపోవడం దారుణం. ఇది కేవలం అన్యాయం కాదు, నేరం," అని మరో రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై గ్రామస్థాయిలో తీవ్రమైన చర్చ జరుగుతుండగా, ఏఈఓ కాటం రాజుపై తక్షణమే విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు అధికారులు డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయ శాఖపై రైతుల నమ్మకాన్ని కోల్పోకుండా ఉండాలంటే ఈ వ్యవహారంపై చురుకైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనిపై పరకాల మండలం వ్యవసాయ అధికారి శ్రీనివాస్ ను సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. 
Tags:

పీడీఎస్ రైస్ పట్టివేత

- 62 బస్తాల బియ్యం స్వాధీనం - టాస్క్‌ఫోర్స్ దాడిలో అక్రమ నిల్వ బట్టబయలు
వార్తలు 
Read More...
పీడీఎస్ రైస్ పట్టివేత

ఏసీబీ వలలో తహశీల్దార్

- చేర్యాల తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు - రూ.70 వేల లంచంతో పట్టుబడిన తహశీల్దార్ 
క్రైమ్ 
Read More...
ఏసీబీ వలలో తహశీల్దార్

గోదావరి జలాలను వృదా చేయొద్దు

- వెంటనే కన్నెపల్లి మోటార్లు ప్రారంభించాలి- లేకపోతే 50 వేల మంది రైతులతో వచ్చి పంప్‌హౌస్‌ను మేమే ఆన్ చేస్తాం- కేసీఆర్‌కు వారం రోజులు...
వార్తలు 
Read More...
గోదావరి జలాలను వృదా చేయొద్దు

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ అధ్యక్షుడిగా నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా పంచమనేని భాస్కరరావు అక్షరదర్బార్,నడికూడ: నడికూడ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మండల జర్నలిస్టుల...
Read More...
నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ

భర్త హత్యకు భార్య స్కెచ్

- రూ.4 లక్షల సుపారీ- సింగారం మాజీ ఉప సర్పంచ్ యాకయ్య హత్య కేసు చేధన- యాకయ్య మృతి వెనుక అసలు నిజాలు బయటపెట్టిన...
క్రైమ్ 
Read More...
భర్త హత్యకు భార్య స్కెచ్