భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి

భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి

భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి
- ఎద్దుపై దాడి చేసి చంపినట్లు గుర్తింపు 
- ప్రజలు ఆందోళన చెందవద్దన్న జిల్లా ఎస్పీ

అక్షరదర్బార్, చిట్యాల: పెద్దపులి సంచారం భూపాలపల్లి జిల్లాలో కలకలం రేపింది. చిట్యాల మండలంలో పెద్దపులి సంచారం జరిగినట్లు తెలిసింది. ఈ మేరకు సమాచారం అందిందని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ వెల్లడించారు. జడల్‌పేట శివారు భీష్మనగర్ ప్రాంతంలో పెద్దపులి ఎద్దుపై దాడి చేసి చంపిన ఘటన చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలు భయాందోళనకు గురైనప్పటికీ, ఆందోళన చెందవద్దని జిల్లా ఎస్పీ ప్రజలకు భరోసా ఇచ్చారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు రాత్రి సమయాల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఒంటరిగా అడవుల వైపు లేదా పొలాల వైపు వెళ్లవద్దని, పెద్దపులి కదలికలపై అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పోలీసు శాఖ నిరంతర నిఘా కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఎలాంటి అనుమానాస్పద కదలికలు గమనించినా వెంటనే పోలీస్ స్టేషన్‌కు లేదా అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజల భద్రతకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని, పరిస్థితి పూర్తిగా నియంత్రణలోకి వచ్చే వరకు అవసరమైన పోలీస్ బందోబస్తు కొనసాగిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు.

Tags:

వడ్ల డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు

వడ్ల డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు కాంట వేసి 10 రోజులు దాటినా ఖాతాల్లో జమ కాని చెల్లింపులు ట్యాబ్‌లో నమోదు ఆలస్యం, ఒటీపీ సమాచారం లేక...
Read More...
వడ్ల డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు

గంజాయి చాక్లెట్ల కలకలం

- ఒడిశా కేటుగాడి అరెస్ట్- ఎంజీఎం సర్కిల్ వద్ద పట్టుకున్న పోలీసులు..- 72 'సెవెన్ మైనర్ వతి' చాక్లెట్లు స్వాధీనం
క్రైమ్ 
Read More...
గంజాయి చాక్లెట్ల కలకలం

ఉపసర్పంచ్‌నే లైన్‌మ్యాన్‌!

ఉపసర్పంచ్‌నే లైన్‌మ్యాన్‌! అక్షరదర్బార్,శాయంపేట:  గ్రామంలో తరచూ ఎదురవుతున్న విద్యుత్‌ సమస్యలను అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో ఉపసర్పంచ్‌ సాయికృష్ణ స్వయంగా రంగంలోకి దిగారు.
Read More...
ఉపసర్పంచ్‌నే లైన్‌మ్యాన్‌!

ఫోన్ కాల్.. ఆపై మృతి!

ఫోన్ కాల్.. ఆపై మృతి! పరకాలలో యువకుడి అనుమానాస్పద మరణం.. హత్యేనని కుటుంబ సభ్యుల ఆరోపణ అక్షరదర్బార్, పరకాల: నడికూడ మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన మమ్మద్...
Read More...
ఫోన్ కాల్.. ఆపై మృతి!

పరకాల మున్సిపల్ కమిషనర్‌గా పోతరాజు పవన్

పరకాల మున్సిపల్ కమిషనర్‌గా పోతరాజు పవన్ అంజయ్య బదిలీ..  అక్షరదర్బార్,పరకాల:పరకాల మున్సిపాలిటీ నూతన కమిషనర్‌గా గ్రూప్-1 అధికారి పోతరాజు పవన్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు కమిషనర్‌గా...
Read More...
పరకాల మున్సిపల్ కమిషనర్‌గా పోతరాజు పవన్