భర్తను హత్య చేసిన భార్య!

భర్తను హత్య చేసిన భార్య!

  • పరకాలలో సినీ పక్కిని తలపించే రీతిలో ఘోరం
  • వివాహేతర సంబంధంతో ఓ వ్యక్తితో కలిసి దారుణం 
  • పోలీసు స్టేషన్ కు చేరుకున్న మృతుడి బంధువులు

భర్త హత్యకు భార్య పన్నాగం

- పరకాలలో సినీ పక్కిని తలపించే ఘోరం 

- వివాహేతర సంబంధం నేపథ్యంలో నరేష్‌తో కలిసి దారుణం చేసినట్లు ఆరోపణలు

అక్షరదర్బార్, పరకాల:
పరకాల పట్టణంలో సినీ కథను తలపించే విధంగా భార్య చేత భర్త హత్యకు గురైనట్టు వెలుగులోకి వచ్చిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సీఎస్ఐ కాలనీకి చెందిన మడికొండ సుమన్ (30), ట్రాక్టర్ మెకానిక్‌గా జీవనం సాగిస్తున్నాడు. అతని భార్య లావణ్యకు నరేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మార్చి 3న సుమన్‌ను నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లిన లావణ్య, తదుపరి రోజు అతని సెల్‌ఫోన్‌లో బ్రతికున్నట్లుగా స్టేటస్ పెట్టినట్లు తెలిసింది. అయితే మార్చి 6న ఏమి తెలియనట్లుగా ఇంటికి చేరుకోవడంతో మృతుడి తండ్రి సాంబయ్యకు అనుమానం కలిగింది. దీంతో మార్చి 8న పరకాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
కేసును నమోదు చేసిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టగా, బుధవారం లావణ్య తన భర్తను హత్య చేసినట్లు ఒప్పుకున్నట్టు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ హత్యలో ఆమె ప్రియుడు నరేష్, తమ్ముడు రాజు కూడా సహకరించినట్లు ఆరోపిస్తున్నారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని చల్వాయి ప్రాంతంలో ఈ హత్య జరిగినట్లు సమాచారం.
ఈ ఘటన పరకాలలో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారగా, మృతుడి బంధువులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసును మరింత లోతుగా విచారిస్తున్నారు.IMG-20260415-WA0025IMG-20260415-WA0026

Tags:

అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను

అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను 2 ఎకరాల 20 గుంటల పంట దగ్ధం తల్లడిల్లుతున్న రైతు కుటుంబం అక్షర దర్బార్,నడికూడ:నడికూడ మండలంలోని కంటత్మకూర్ గ్రామంలో రైతుకు...
Read More...
అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను

సంజయ్ దిష్టిబొమ్మ దగ్దం

- హనుమకొండ కాంగ్రెస్ భవన్ వద్ద మహిళా కాంగ్రెస్ ధర్నా - బండి సంజయ్ తనయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎర్రబెల్లి స్వర్ణ డిమాండ్
Read More...
సంజయ్ దిష్టిబొమ్మ దగ్దం

వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం

వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం అక్షరదర్బార్, శాయంపేట:శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన కందగట్ల నరహరి (50) (తండ్రి  కనుకయ్య) అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన...
Read More...
వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం

రగిలిన కరీంనగర్

గంగుల క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత  ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి బీజేపీ కార్యకర్తల యత్నం - కౌశిక్ రెడ్డి కారు, గంగుల క్యాంపు ఆఫీసులోని ఫర్నిచర్...
వార్తలు 
Read More...
రగిలిన కరీంనగర్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.    -మృతుడు మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామ నివాసి.    -కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న హుజురాబాద్ పోలీసులు.    అక్షర దర్బార్, మొగుళ్లపల్లి:...
Read More...
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి