ప్రభుత్వ ఆసుపత్రి పనులు వేగవంతం చేయాలి

ప్రభుత్వ ఆసుపత్రి పనులు వేగవంతం చేయాలి

ప్రభుత్వ ఆసుపత్రి పనులు వేగవంతం చేయాలి

పరకాల ఎమ్మెల్యే రేవూరి

అక్షర దర్బార్,పరకాల: 
పరకాల పట్టణ కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆసుపత్రి పరిసర ప్రాంతాలను అధికారులతో కలిసి సమీక్షించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆసుపత్రి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో పనులు శిలాఫలకాలకే పరిమితమయ్యాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్ బిల్లులను విడుదల చేసి పనులకు వేగం తీసుకువచ్చామని తెలిపారు.త్వరలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రారంభోత్సవం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన జరగనుందని పేర్కొన్నారు. అలాగే టీయూఎఫ్ఐడీసీ నిధులతో పరకాల మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డిఓ డాక్టర్ నారాయణ, మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్, ప్రభుత్వ ఆస్పటల్ సూపర్డెంట్ గౌతమ్ చౌహన్, పరకాల పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను

అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను 2 ఎకరాల 20 గుంటల పంట దగ్ధం తల్లడిల్లుతున్న రైతు కుటుంబం అక్షర దర్బార్,నడికూడ:నడికూడ మండలంలోని కంటత్మకూర్ గ్రామంలో రైతుకు...
Read More...
అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను

సంజయ్ దిష్టిబొమ్మ దగ్దం

- హనుమకొండ కాంగ్రెస్ భవన్ వద్ద మహిళా కాంగ్రెస్ ధర్నా - బండి సంజయ్ తనయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎర్రబెల్లి స్వర్ణ డిమాండ్
Read More...
సంజయ్ దిష్టిబొమ్మ దగ్దం

వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం

వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం అక్షరదర్బార్, శాయంపేట:శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన కందగట్ల నరహరి (50) (తండ్రి  కనుకయ్య) అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన...
Read More...
వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం

రగిలిన కరీంనగర్

గంగుల క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత  ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి బీజేపీ కార్యకర్తల యత్నం - కౌశిక్ రెడ్డి కారు, గంగుల క్యాంపు ఆఫీసులోని ఫర్నిచర్...
వార్తలు 
Read More...
రగిలిన కరీంనగర్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.    -మృతుడు మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామ నివాసి.    -కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న హుజురాబాద్ పోలీసులు.    అక్షర దర్బార్, మొగుళ్లపల్లి:...
Read More...
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి