ఐపీఎల్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు

ఐపీఎల్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు

- ఐదుగురి అరెస్ట్, రూ.లక్షకుపైగా నగదు సీజ్
- ముగ్గురు పరారీ 

ఐపీఎల్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు
- ఐదుగురి అరెస్ట్, రూ.లక్షకుపైగా నగదు సీజ్
- ముగ్గురు పరారీ 

అక్షరదర్బార్, వరంగల్: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ల నేపథ్యంలో సాగుతున్న ఆన్‌లైన్ బెట్టింగ్‌లపై వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో బెట్టింగ్ నిర్వహిస్తున్న ఒక నిర్వాహకుడితో పాటు నలుగురు పందెం రాయుళ్లను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ ఏ. మధుసూదన్ నేతృత్వంలోని బృందం దాడులు నిర్వహించింది. *Cricxbet.99.win* మరియు *Bsf2020.com* వంటి వెబ్‌సైట్ల ద్వారా ఆన్‌లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక నిర్వాహకుడు, 4 గురు పందెం రాయుళ్లు మొత్తం ఐదుగురిని అరెస్టు చేశారు. ముగ్గురు పరారీలో ఉన్నారు. రూ.1,02,000 నగదు, 5 స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
- అరెస్టయిన నిందితుల వివరాలు
నిర్వాహకుడు తాడెం భరత్  వరంగల్ మధ్యకోట నివాసి. ఇతను ప్రధానంగా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. లౌడ్యా వెంకన్నది వరంగల్ ఎస్.ఆర్ నగర్. పైడి శ్రీధర్ వరంగల్ కొత్థవాడ వాసి.‌ వంగ రమేష్ ది వరంగల్ కరీమాబాద్.ములుక శ్రీనివాస్ ది వరంగల్ ఎస్.ఆర్.ఆర్ తోట. ఈ కేసులో సంతోష్ కుమార్ (హన్మకొండ), పూల శ్రీకాంత్ (శంభునిపేట), రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్‌కు చెందిన మరో నిర్వాహకుడు రావుల దిలీప్ కుమార్ పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
- పోలీసుల హెచ్చరిక
పట్టుబడిన నిందితులను, స్వాధీనం చేసుకున్న నగదు, ఫోన్లను తదుపరి చర్యల నిమిత్తం మిల్స్ కాలనీ పోలీసులకు అప్పగించారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ ఏసీపీ ఏ. మధుసూదన్, ఇన్ స్పెక్టర్ సర్ల రాజు, ఆర్.ఎస్.ఐ భాను ప్రకాష్, సిబ్బంది పాల్గొన్నారు. యువత క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

Tags:

విద్యే ఆయుధం.. వివక్షే నా కసి!

- డిజిటల్ మీడియా ప్రతినిధుల చిట్ చాట్ లో బీజేపీ నేత, పరకాల నియోజకవర్గం కాంటెస్టెడ్ అభ్యర్థి డాక్టర్ పగడాల కాళీప్రసాద్ రావు
రాజకీయం 
Read More...
విద్యే ఆయుధం.. వివక్షే నా కసి!

లక్ష్మణ్ బాపూజీ పోరాటం స్ఫూర్తిదాయకం

లక్ష్మణ్ బాపూజీ పోరాటం స్ఫూర్తిదాయకం   కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అక్షరదర్బార్, శాయంపేట: తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన...
Read More...
లక్ష్మణ్ బాపూజీ పోరాటం స్ఫూర్తిదాయకం

చెల్లిని కాపాడబోయి అక్క..

- నీటి కుంటలో మునిగి ఇద్దరు చిన్నారుల మృతి- కాసిందేవిపేట గ్రామంలో విషాదం
క్రైమ్ 
Read More...
చెల్లిని కాపాడబోయి అక్క..

చాకిరేవు గుట్టపై అక్రమ మైనింగ్‌కు అనుమతులెలా?

చాకిరేవు గుట్టపై అక్రమ మైనింగ్‌కు అనుమతులెలా? అసైన్డ్‌ భూముల్లో తవ్వకాలకు అనుమతులపై డా. కాళీ ప్రసాద్‌రావు ప్రశ్న అక్షరదర్బార్, పరకాల నడికూడ మండలంలోని కంటాత్మకూర్‌ గ్రామంలోని చాకిరేవు...
Read More...
చాకిరేవు గుట్టపై అక్రమ మైనింగ్‌కు అనుమతులెలా?

ఆ గుట్టపై కాంట్రాక్టర్ కన్ను!

ఆ గుట్టపై కాంట్రాక్టర్ కన్ను! గ్రానైట్ పేరుతో గుప్తనిధుల వేటా?..  చాకిరేవు గుట్ట పరిరక్షణకు గ్రామస్తుల దీక్ష అక్షరదర్బార్,నడికూడనడికూడ మండలంలోని కంఠాత్మకూర్ గ్రామంలోని చాకిరేవు గుట్టపై...
Read More...
ఆ గుట్టపై కాంట్రాక్టర్ కన్ను!