దామెరలో గంజాయి పట్టివేత..

దామెరలో గంజాయి పట్టివేత..

దామెరలో గంజాయి పట్టివేత..

210 గ్రాములు స్వాధీనం  

ఇద్దరు యువకులు అరెస్ట్

అక్షరదర్బార్, పరకాల:
దామెర పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు చర్యలు చేపట్టి ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. సోమవారం ఉదయం 10:30 గంటల సమయంలో ఎస్‌ఐ కొంక అశోక్ తన సిబ్బందితో కలిసి లాదేల్ల గ్రామ శివారు శ్రీ అన్నపూర్ణ రైస్ మిల్లు సమీపంలోని సిరి క్రషర్ క్రాస్ రోడ్డులో వాహన తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా నెంబర్ ప్లేట్ లేని మోటార్ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా వారిని అదుపులోకి తీసుకున్నారు. తనిఖీలో వారి వద్ద 210 గ్రాముల గంజాయి లభించడంతో స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించారు.
పట్టుబడిన వారు మేకల అనిల్ కుమార్ (23), బైరపాక రాజేష్ (19)గా గుర్తించారు. వీరు నడికూడ మండలం కంఠాత్మకూర్ గ్రామానికి చెందినవారు. విచారణలో బొల్లికుంట వద్ద బుస్స అరవింద్, ఊకంటి పూర్ణచందర్ రెడ్డి @ సన్నీ రెడ్డి వద్ద గంజాయి కొనుగోలు చేసి తీసుకువస్తున్నట్లు ఒప్పుకున్నారు.
అనంతరం కేసు నమోదు చేసి పరకాల రూరల్ సీఐ పి. రంజిత్ రావు నిందితులను రిమాండ్‌కు తరలించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.10,000 వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.

Tags:

పరకాలలో ఒక్కసారిగా మంటలు

పరకాలలో ఒక్కసారిగా మంటలు సీఐ క్రాంతికుమార్ చొరవతో తప్పిన పేను ప్రమాదం అక్షరదర్బార్, పరకాల:పరకాల పట్టణంలోని ఇండియన్ గ్యాస్ గోదాం వెనుక ఉన్న పంట పొలాల్లో...
Read More...
పరకాలలో ఒక్కసారిగా మంటలు

అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను

అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను 2 ఎకరాల 20 గుంటల పంట దగ్ధం తల్లడిల్లుతున్న రైతు కుటుంబం అక్షర దర్బార్,నడికూడ:నడికూడ మండలంలోని కంటత్మకూర్ గ్రామంలో రైతుకు...
Read More...
అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను

సంజయ్ దిష్టిబొమ్మ దగ్దం

- హనుమకొండ కాంగ్రెస్ భవన్ వద్ద మహిళా కాంగ్రెస్ ధర్నా - బండి సంజయ్ తనయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎర్రబెల్లి స్వర్ణ డిమాండ్
Read More...
సంజయ్ దిష్టిబొమ్మ దగ్దం

వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం

వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం అక్షరదర్బార్, శాయంపేట:శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన కందగట్ల నరహరి (50) (తండ్రి  కనుకయ్య) అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన...
Read More...
వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం

రగిలిన కరీంనగర్

గంగుల క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత  ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి బీజేపీ కార్యకర్తల యత్నం - కౌశిక్ రెడ్డి కారు, గంగుల క్యాంపు ఆఫీసులోని ఫర్నిచర్...
వార్తలు 
Read More...
రగిలిన కరీంనగర్