బావిలో ముగ్గురు మృతి

బావిలో ముగ్గురు మృతి

  • పూడిక తీస్తుండగా తెగిన క్రేను వైరు
  • ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి 
  • మరొకరికి తీవ్ర గాయాలు 
  • కొరికిశాల గ్రామంలో విషాదం

క్రేన్ వైరు తెగి 
బావిలో ముగ్గురు మృతి 
- మొగుళ్లపల్లి మండలం కొరికిశాల గ్రామంలో ఘటన 

అక్షరదర్బార్, మొగుళ్లపల్లి: భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని కొరికిశాల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ బావిలో పూడిక తీస్తుండగా క్రేన్ వైరు తెగి పడటంతో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను కొరికిశాల గ్రామానికి చెందిన దేవారావు(48), అభిలాష్(16), పిడిసిల్ల గ్రామస్తుడు పైడయ్య(53)గా గుర్తించారు. సుకినె మోహన్ రావు గాయపడ్డారు. ఈ నలుగురు శనివారం మధ్యాహ్నం వ్యవసాయ బావిలో ఉన్న సమయంలో పూడికతీత పనిలో ఉన్న క్రేన్ వైరు తెగి బావిలో పడిపోవడంతో ముగ్గురు దుర్మరణం చెందగా గాయపడిన మోహన్ రావు ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందగానే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో బావిలో నుంచి ముగ్గురు మృతదేహాలను బయటకు తీశారు. మృతుల కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. వేసవి దృష్ట్యా సాగు నీటి కోసం వ్యవసాయ బావిలో నుంచి పూడిక తీసే పనులు చేపట్టగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది.

Tags:

జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌గా వెంకన్న

ఆయన స్వస్థలం మరిపెడ అదనపు బాధ్యతల నుంచి కలెక్టర్ రిలీవ్ 
వార్తలు 
Read More...
 జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌గా వెంకన్న

కల్తీ పచ్చళ్ల తయారీ కేంద్రం గుట్టురట్టు

- టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి.. ఒకరి అరెస్ట్ - రూ. 2.25 లక్షల విలువైన నిల్వలు స్వాధీనం   
క్రైమ్ 
Read More...
కల్తీ పచ్చళ్ల తయారీ కేంద్రం గుట్టురట్టు

లారీ బీభత్సం.. ఆర్టీవో మృతి

భూపాలపల్లి ఆర్టీవో కార్యాలయం ముందు ఘోర ప్రమాదం దూసుకెళ్లిన లారీ.. ఆర్టీవో వెంకన్న దుర్మరణం 
క్రైమ్ 
Read More...
లారీ బీభత్సం.. ఆర్టీవో మృతి

ఎమ్మెల్యేను విమర్శించే అర్హత బీఆర్ఎస్‌కు లేదు

ఎమ్మెల్యేను విమర్శించే అర్హత బీఆర్ఎస్‌కు లేదు - రేవూరి గొప్పతనం పరకాల ప్రజలకు తెలుసు  మున్సిపల్ చైర్మన్ సునీల్ కుమార్ అక్షరదర్బార్, పరకాల :పరకాల ఎమ్మెల్యే...
Read More...
ఎమ్మెల్యేను విమర్శించే అర్హత బీఆర్ఎస్‌కు లేదు

నిషేధిత కలుపు మందు స్వాధీనం

- పరకాలలో విజిలెన్స్ దాడులు..  - 150 లీటర్ల స్పీడ్ పారాక్వాట్ పట్టివేత
వార్తలు 
Read More...
నిషేధిత కలుపు మందు స్వాధీనం