ఏసీబీ పంజా

ఏసీబీ పంజా

  • లంచం తీసుకుంటూ  పట్టుపడిన ఎంఈవో, స్కూల్ అసిస్టెంట్
  • అరెస్టు, విచారణ

ఏసీబీ పంజా
- లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎంఈఓ, స్కూల్ అసిస్టెంట్

అక్షరదర్బార్, మహబూబాబాద్: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు జిల్లాలో మరో భారీ ట్రాప్ నిర్వహించారు. గూడూరు మండలం అయోధ్యపురంలోని ఒక పాఠశాలలో పదవీ విరమణ పొందనున్న ఉపాధ్యాయుడి నుండి లంచం డిమాండ్ చేసిన ఇంచార్జ్ ఎంఈఓ, స్కూల్ అసిస్టెంట్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అయోధ్యపురం పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు త్వరలో పదవీ విరమణ చేయనున్నారు. ఆయనకు సంబంధించిన అధికారిక పనులను పూర్తి చేసేందుకు ఇంచార్జ్ ఎంఈఓ రవికుమార్, ఆయనకు సహకరిస్తున్న స్కూల్ అసిస్టెంట్ చంద్రమౌళి రూ.15,000 లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో పథకం ప్రకారం ఈరోజు దాడి నిర్వహించారు.
- అరెస్ట్, విచారణ
లంచం డబ్బులు తీసుకుంటుండగా రవికుమార్, చంద్రమౌళిలను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ధృవీకరించారు. నిందితులిద్దరిని అరెస్ట్ చేసి, రిమాండ్ నిమిత్తం ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.

Tags:

పరకాలలో ఒక్కసారిగా మంటలు

పరకాలలో ఒక్కసారిగా మంటలు సీఐ క్రాంతికుమార్ చొరవతో తప్పిన పేను ప్రమాదం అక్షరదర్బార్, పరకాల:పరకాల పట్టణంలోని ఇండియన్ గ్యాస్ గోదాం వెనుక ఉన్న పంట పొలాల్లో...
Read More...
పరకాలలో ఒక్కసారిగా మంటలు

అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను

అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను 2 ఎకరాల 20 గుంటల పంట దగ్ధం తల్లడిల్లుతున్న రైతు కుటుంబం అక్షర దర్బార్,నడికూడ:నడికూడ మండలంలోని కంటత్మకూర్ గ్రామంలో రైతుకు...
Read More...
అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను

సంజయ్ దిష్టిబొమ్మ దగ్దం

- హనుమకొండ కాంగ్రెస్ భవన్ వద్ద మహిళా కాంగ్రెస్ ధర్నా - బండి సంజయ్ తనయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎర్రబెల్లి స్వర్ణ డిమాండ్
Read More...
సంజయ్ దిష్టిబొమ్మ దగ్దం

వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం

వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం అక్షరదర్బార్, శాయంపేట:శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన కందగట్ల నరహరి (50) (తండ్రి  కనుకయ్య) అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన...
Read More...
వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం

రగిలిన కరీంనగర్

గంగుల క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత  ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి బీజేపీ కార్యకర్తల యత్నం - కౌశిక్ రెడ్డి కారు, గంగుల క్యాంపు ఆఫీసులోని ఫర్నిచర్...
వార్తలు 
Read More...
రగిలిన కరీంనగర్