ఎస్ఆర్ఓల ఇళ్లలో కనకవర్షం

ఎస్ఆర్ఓల ఇళ్లలో కనకవర్షం

  • నగదు, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్న ఏసీబీ
  • బహిర్గతమైన వాట్సాప్ చాటింగ్.. అధికారుల అవినీతి గుట్టురట్టు
  • ఫోన్ పే ద్వారానే రూ.42 లక్షల లావాదేవీలు
  • వడ్డేపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో కళ్లు చెదిరే అక్రమాలు
  • ఏసీబీ సోదాలతో విస్తుపోయే నిజాలు వెలుగులోకి

ఎస్ఆర్ఓల ఇళ్లలో కనక వర్షం
- నగదు, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్న ఏసీబీ 
- బహిర్గతమైన వాట్సాప్ చాటింగ్.. అధికారుల అవినీతి గుట్టురట్టు 
- ఫోన్ పే ద్వారానే రూ.42 లక్షల లావాదేవీలు
- వడ్డేపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో కళ్లు చెదిరే అక్రమాలు
- ఏసీబీ సోదాలతో విస్తుపోయే నిజాలు వెలుగులోకి

అక్షరదర్బార్, హనుమకొండ: హనుమకొండ వడ్డేపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందని ఏసీబీ సోదాల్లో తేలిపోయింది. నిన్న నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అధికారులు, ప్రైవేటు వ్యక్తుల మధ్య సాగుతున్న చీకటి దందా బట్టబయలైంది. తనిఖీల సమయంలో కార్యాలయంలో ఏకంగా 20 మంది అనధికార ఏజెంట్లు, డాక్యుమెంట్ రైటర్లు తిష్టవేసి ఉండటం అధికారులను ఆశ్చర్యపరిచింది. వారి సెల్ ఫోన్లను పరిశీలించగా డిజిటల్ మాఫియా వెలుగుచూసింది. కేవలం ఏడాది కాలంలోనే రూ.42 లక్షల మేర 'ఫోన్ పే' లావాదేవీలు జరిగినట్లు ఏసీబీ నిర్ధారించింది. ఎస్ఆర్వోలు వాట్సాప్ చాటింగ్ ద్వారా చిక్కారు. ఎస్ఆర్ఓలు రామనర్సింహారావు, ఆనంద్ మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణలు వారి అక్రమాలకు సాక్ష్యంగా నిలిచాయి. ఆఫీసులో 204 డెలివరీ కాని డాక్యుమెంట్లు ఎస్ఆర్ఓల వద్దే పెండింగ్‌లో ఉండటం గమనార్హం.
- ఇళ్లలో భారీగా ఆస్తులు
ఎస్ఆర్ఓల నివాసాల్లో ఏసీబీ నిర్వహించిన సోదాల్లో కళ్లు చెదిరే రీతిలో అక్రమాస్తులు దొరికాయి. నగదు రూ.24.61 లక్షలు, బంగారం 820 గ్రాములు, వెండి 2.60 కిలోలు, ఎస్ఆర్ఓ ఆనంద్ పేరిట కపిల్ చిట్స్‌లో రూ. 30 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కార్యాలయంలో లెక్కల్లో చూపని మరో రూ. 47,450 నగదుతో పాటు 70 కీలక దస్త్రాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం అధికారులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

Tags:

అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను

అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను 2 ఎకరాల 20 గుంటల పంట దగ్ధం తల్లడిల్లుతున్న రైతు కుటుంబం అక్షర దర్బార్,నడికూడ:నడికూడ మండలంలోని కంటత్మకూర్ గ్రామంలో రైతుకు...
Read More...
అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను

సంజయ్ దిష్టిబొమ్మ దగ్దం

- హనుమకొండ కాంగ్రెస్ భవన్ వద్ద మహిళా కాంగ్రెస్ ధర్నా - బండి సంజయ్ తనయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎర్రబెల్లి స్వర్ణ డిమాండ్
Read More...
సంజయ్ దిష్టిబొమ్మ దగ్దం

వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం

వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం అక్షరదర్బార్, శాయంపేట:శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన కందగట్ల నరహరి (50) (తండ్రి  కనుకయ్య) అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన...
Read More...
వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం

రగిలిన కరీంనగర్

గంగుల క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత  ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి బీజేపీ కార్యకర్తల యత్నం - కౌశిక్ రెడ్డి కారు, గంగుల క్యాంపు ఆఫీసులోని ఫర్నిచర్...
వార్తలు 
Read More...
రగిలిన కరీంనగర్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.    -మృతుడు మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామ నివాసి.    -కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న హుజురాబాద్ పోలీసులు.    అక్షర దర్బార్, మొగుళ్లపల్లి:...
Read More...
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి