మూడు గ్రామాల్లో దొంగల హల్చల్

మూడు గ్రామాల్లో దొంగల హల్చల్

  • పల్సర్ బైక్, నగదు అపహరణ
  • కరెంట్ వైర్లూ చోరీ.. కేసు నమోదు 
  • మొగుళ్లపల్లి మండలంలో ప్రజల ఆందోళన

దొంగల హల్చల్.
- ఒక బైక్, రూ.15 వేల నగదు, కరెంటు వైర్లు అపహరణ.
- సంఘటన స్థలం వద్దనే పోలీసుల కేసు నమోదు.

అక్షరదర్బార్, మొగుళ్లపల్లి: గత రెండు మూడు రోజుల నుండి భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల పరిధిలోని మూడు గ్రామాల్లో వేరువేరుగా దొంగలు హల్చల్ సృష్టించారు. దొంగలు ఒక గ్రామంలో రూ.1,60,000 విలువ చేసే పల్సర్ బైక్ ను దొంగతనం చేయగా.. మరో గ్రామంలో రూ.15 వేల నగదును అపహరించారు. ఇంకో గ్రామంలో రైతులకు సంబంధించిన కరెంటు వైర్లను దొంగలించారు. వరుస సంఘటనలతో మొగుళ్ళపల్లి మండలంలో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మొగుళ్ళపల్లి మండలం పర్లపల్లి గ్రామానికి చెందిన దొమ్మటి వెంకటేష్ అనే వ్యక్తికి సంబంధించిన ద్విచక్ర వాహనాన్ని దొంగలు అపహరించారు. అదే గ్రామంలోని బోనగిరి శశిరేఖ ఇంటిలో తలుపులు పగలగొట్టి ప్రవేశించి దొంగతనం చేసే ప్రయత్నం చేసి పారిపోయారు. అదే రోజు ఇప్పలపల్లి గ్రామానికి చెందిన గుర్రపు పుల్లమ్మ ఇంటిలో ఉదయం 10:30 గంటల మధ్య చొరబడి ఇంట్లో ఉన్న ఆల్మర పగలగొట్టి రూ.15 వేల నగదు దొంగలించి పరారయ్యారు. మండలంలోని మొట్లపల్లి గ్రామంలో రైతులకు సంబంధించిన విద్యుత్తు వైర్లను దొంగలించి దుండగులు పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు మొగుళ్ళపల్లి ఎస్సై ఎం సురేష్ బాధితుల ఇళ్ల వద్దకే వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆయన మొగుళ్లపల్లి ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నాలుగు కేసుల్లో బాధితుల ఇంటి వద్దనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం గమనార్ధం.IMG-20260329-WA0012   IMG-20260329-WA0012

Tags:

అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను

అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను 2 ఎకరాల 20 గుంటల పంట దగ్ధం తల్లడిల్లుతున్న రైతు కుటుంబం అక్షర దర్బార్,నడికూడ:నడికూడ మండలంలోని కంటత్మకూర్ గ్రామంలో రైతుకు...
Read More...
అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను

సంజయ్ దిష్టిబొమ్మ దగ్దం

- హనుమకొండ కాంగ్రెస్ భవన్ వద్ద మహిళా కాంగ్రెస్ ధర్నా - బండి సంజయ్ తనయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎర్రబెల్లి స్వర్ణ డిమాండ్
Read More...
సంజయ్ దిష్టిబొమ్మ దగ్దం

వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం

వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం అక్షరదర్బార్, శాయంపేట:శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన కందగట్ల నరహరి (50) (తండ్రి  కనుకయ్య) అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన...
Read More...
వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం

రగిలిన కరీంనగర్

గంగుల క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత  ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి బీజేపీ కార్యకర్తల యత్నం - కౌశిక్ రెడ్డి కారు, గంగుల క్యాంపు ఆఫీసులోని ఫర్నిచర్...
వార్తలు 
Read More...
రగిలిన కరీంనగర్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.    -మృతుడు మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామ నివాసి.    -కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న హుజురాబాద్ పోలీసులు.    అక్షర దర్బార్, మొగుళ్లపల్లి:...
Read More...
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి