ఎల్కతుర్తి ఎస్సైపై వేటు

ఎల్కతుర్తి ఎస్సైపై వేటు

  • ఏఆర్ కు అటాచ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు
  • విచారణలో ఆరోపణలు నిర్ధారణ 

ఎల్కతుర్తి ఎస్సైపై వేటు
- ఏఆర్‌కు అటాచ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు

అక్షరదర్బార్, ఎల్కతుర్తి: అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఎల్కతుర్తి సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) ప్రవీణ్ కుమార్ పై బదిలీ వేటు పడింది. ఆయనపై వచ్చిన ఆరోపణలు ప్రాథమిక విచారణలో నిజమని తేలడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎస్సై ప్రవీణ్ కుమార్‌ను సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గత కొంతకాలంగా ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇసుక అక్రమ రవాణా, భూ వివాదాలు, ఇతర సివిల్ పంచాయితీల్లో ఎస్సై ప్రవీణ్ కుమార్ తలదూరుస్తున్నారని, అవినీతికి పాల్పడుతున్నారని ఉన్నతాధికారులకు వరుసగా ఫిర్యాదులు అందాయి. దీనిపై అంతర్గత విచారణ జరిపిన ఉన్నతాధికారులు, ఎస్సై తీరుపై ఒక సమగ్ర నివేదికను కమిషనర్‌కు సమర్పించారు.
- విచారణ నివేదిక ఆధారంగా చర్యలు
అధికారులు సమర్పించిన నివేదికలో ఎస్సైపై వచ్చిన ఆరోపణలు నిర్ధారణ కావడంతో, శాఖాపరమైన క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయనను తక్షణమే విధుల్లో నుంచి తొలగించి ఏఆర్‌కు బదిలీ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, అవినీతికి పాల్పడినా సహించేది లేదని ఈ సందర్భంగా పోలీస్ ఉన్నతాధికారులు హెచ్చరించారు. ప్రవీణ్ కుమార్ బదిలీతో ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్‌కు కొత్త ఎస్సైగా ఎవరిని నియమిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం స్టేషన్ బాధ్యతలను స్థానిక సీఐ పర్యవేక్షిస్తున్నారు.

Tags:

వడ్ల డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు

వడ్ల డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు కాంట వేసి 10 రోజులు దాటినా ఖాతాల్లో జమ కాని చెల్లింపులు ట్యాబ్‌లో నమోదు ఆలస్యం, ఒటీపీ సమాచారం లేక...
Read More...
వడ్ల డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు

గంజాయి చాక్లెట్ల కలకలం

- ఒడిశా కేటుగాడి అరెస్ట్- ఎంజీఎం సర్కిల్ వద్ద పట్టుకున్న పోలీసులు..- 72 'సెవెన్ మైనర్ వతి' చాక్లెట్లు స్వాధీనం
క్రైమ్ 
Read More...
గంజాయి చాక్లెట్ల కలకలం

ఉపసర్పంచ్‌నే లైన్‌మ్యాన్‌!

ఉపసర్పంచ్‌నే లైన్‌మ్యాన్‌! అక్షరదర్బార్,శాయంపేట:  గ్రామంలో తరచూ ఎదురవుతున్న విద్యుత్‌ సమస్యలను అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో ఉపసర్పంచ్‌ సాయికృష్ణ స్వయంగా రంగంలోకి దిగారు.
Read More...
ఉపసర్పంచ్‌నే లైన్‌మ్యాన్‌!

ఫోన్ కాల్.. ఆపై మృతి!

ఫోన్ కాల్.. ఆపై మృతి! పరకాలలో యువకుడి అనుమానాస్పద మరణం.. హత్యేనని కుటుంబ సభ్యుల ఆరోపణ అక్షరదర్బార్, పరకాల: నడికూడ మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన మమ్మద్...
Read More...
ఫోన్ కాల్.. ఆపై మృతి!

పరకాల మున్సిపల్ కమిషనర్‌గా పోతరాజు పవన్

పరకాల మున్సిపల్ కమిషనర్‌గా పోతరాజు పవన్ అంజయ్య బదిలీ..  అక్షరదర్బార్,పరకాల:పరకాల మున్సిపాలిటీ నూతన కమిషనర్‌గా గ్రూప్-1 అధికారి పోతరాజు పవన్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు కమిషనర్‌గా...
Read More...
పరకాల మున్సిపల్ కమిషనర్‌గా పోతరాజు పవన్