ఖబడ్దార్‌ బీజేపీ నేతలారా.. 

ఖబడ్దార్‌ బీజేపీ నేతలారా.. 

ఖబడ్దార్‌ బీజేపీ నేతలారా.. 

పరకాల అభివృద్ధిపై చర్చకు సిద్ధమా!

పరకాల అభివృద్ధిలో చల్లా ధర్మారెడ్డి కృషి మరువలేనిది


అక్షరదర్బార్‌, పరకాల: 
తెలంగాణలో ప్రజలకు పరిపాలనను చేరువ చేసేందుకే మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ 33 జిల్లాలను ఏర్పాటు చేసి, జిల్లా కలెక్టరేట్లు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ద్వారా మెరుగైన సేవలు అందించారని బీఆర్‌ఎస్‌ నాయకులు పేర్కొన్నారు. ఆదివారం పరకాల పట్టణంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో వారు మాట్లాడుతూ.. గతంలో జిల్లా కేంద్రాలకు వెళ్లేందుకు ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను తగ్గించేందుకు కొత్త జిల్లాల ఏర్పాటు దోహదపడిందన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ సేవలకు కృతజ్ఞతగా జిల్లా కేంద్రాల్లో ఆయన చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించినట్లు తెలిపారు.

పరకాల అభివృద్ధిలో చల్లా కృషి

పరకాల నియోజకవర్గ అభివృద్ధికి మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విశేష కృషి చేశారని బీఆర్‌ఎస్‌ నాయకులు అన్నారు. రహదారుల నిర్మాణం, ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు, వైద్య సదుపాయాల అభివృద్ధి వంటి పలు కార్యక్రమాల ద్వారా ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేశారని పేర్కొన్నారు. రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు, పరకాలలో 100 పడకల ఆసుపత్రి అందుబాటులోకి రావడం ప్రజలకు ఉపయోగకరమని తెలిపారు.


పరకాల అభివృద్ధిపై విమర్శలు చేసే ముందు గతంలో జరిగిన పనులను గుర్తించాలని బీజేపీ నాయకులకు బీఆర్‌ఎస్‌ నేతలు సూచించారు. రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా ప్రజలకు చేసిన అభివృద్ధి పనులపై చర్చించాలని అన్నారు. పరకాల నియోజకవర్గంలో చల్లా ధర్మారెడ్డి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందించిన సేవలపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
కేసీఆర్‌ నాయకత్వంలో అమలైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గుర్తిస్తున్నారని, పరకాల నియోజకవర్గ అభివృద్ధికి బీఆర్‌ఎస్‌ నిరంతరం కృషి చేస్తుందని నాయకులు తెలిపారు. ప్రజలకు చేసిన అభివృద్ధే తమ బలమని, పరకాల అభివృద్ధే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

Tags:

ఖబడ్దార్‌ బీజేపీ నేతలారా.. 

ఖబడ్దార్‌ బీజేపీ నేతలారా..  పరకాల అభివృద్ధిపై చర్చకు సిద్ధమా! పరకాల అభివృద్ధిలో చల్లా ధర్మారెడ్డి కృషి మరువలేనిది అక్షరదర్బార్‌, పరకాల: తెలంగాణలో ప్రజలకు పరిపాలనను చేరువ చేసేందుకే...
Read More...
ఖబడ్దార్‌ బీజేపీ నేతలారా.. 

రామప్పను రక్షించుకుందాం

- డిజిటల్ మీడియా ప్రతినిధుల చిట్ చాట్ లో కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ సభ్యుడు ప్రొఫెసర్ ఎం పాండురంగారావు
వార్తలు 
Read More...
రామప్పను రక్షించుకుందాం

అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల ఉక్కుపాదం

అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల ఉక్కుపాదం నడికూడ గుట్టపై నిర్మాణాల కూల్చివేత ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలురెవెన్యూ అధికారులు అక్షరదర్బార్,నడికూడ: నడికూడ మండలంలోని నడికూడ...
Read More...
అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల ఉక్కుపాదం

వృద్ధురాలి హత్య.. దోపిడీ కేసులో నిందితుడి అరెస్ట్

వృద్ధురాలి హత్య.. దోపిడీ కేసులో నిందితుడి అరెస్ట్ పైకప్పు ద్వారా ఇంట్లోకి ప్రవేశం..   కేకలు వేయడంతో ఇనుపరాడ్‌తో దాడి రెండు బంగారు పుస్తెలు, రక్తపు మరకల దుస్తులు...
Read More...
వృద్ధురాలి హత్య.. దోపిడీ కేసులో నిందితుడి అరెస్ట్

సోషల్‌ మీడియా మాట నమ్మి మందులు వాడొద్దు

సోషల్‌ మీడియా మాట నమ్మి మందులు వాడొద్దు రసాయన మందులతో పంటలకు నష్టం మాజీ తెలంగాణ రైతు రుణ విమోచన కమిటీ చైర్మన్‌ నాగూర్ల అక్షరదర్బార్,పరకాల: పంటల్లో...
Read More...
సోషల్‌ మీడియా మాట నమ్మి మందులు వాడొద్దు