భర్త హత్యకు రూ.5 లక్షల సుపారీ

భర్త హత్యకు రూ.5 లక్షల సుపారీ

- హత్య చేసి వీడియో తీసిన కిరాయి హంతకులు 
- ప్రియుడు తమ్ముడు తో కలిసి భర్తను అంతం చేసిన ఇల్లాలు
- భర్తను చంపాక తగులబెట్టి.. బొక్కలను వాగులో పారేసిన భార్య
- వివాహేతర సంబంధంతో భర్త హత్యకు భార్య స్కెచ్
- మిస్సింగ్ కేసులో విస్తుపోయే నిజాలు
- భార్య సహా ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు

భర్త హత్యకు రూ.5 లక్షల సుపారీ
- హత్య చేసి వీడియో తీసిన కిరాయి హంతకులు 
- ప్రియుడు తమ్ముడు తో కలిసి భర్తను అంతం చేసిన ఇల్లాలు
- భర్తను చంపాక తగులబెట్టి.. బొక్కలను వాగులో పారేసిన భార్య
- వివాహేతర సంబంధంతో భర్త హత్యకు భార్య స్కెచ్
- మిస్సింగ్ కేసులో విస్తుపోయే నిజాలు
- భార్య సహా ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు


అక్షరదర్బార్, పరకాల:

హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో ఇటీవల అదృశ్యమైన మడికొండ సుమన్ భరత్ (38) ఉదంతం విషాదాంతమైంది. తన భర్తను అడ్డుతొలగించుకోవాలని భార్య, తన ప్రియుడు, తమ్ముడితో కలిసి కిరాయి హంతకులతో చేయించిన పక్కా ప్లాన్ హత్యగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో మృతుడి హత్యకు గురైన సుమన్ భరత్ భార్య ను సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు శుక్రవారం ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్ మీడియాకు వివరాలను వెల్లడించారు. పరకాల ఏసీప సతీష్ బాబు,- సీఐ క్రాంతి కుమార్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

వివాహేతర సంబంధమే కారణం
పోలీసుల కథనం ప్రకారం.. పరకాలకు చెందిన సుమన్ భరత్‌కు 2012లో లావణ్యతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, లావణ్యకు అదే పట్టణానికి చెందిన ఇమ్మడి నరేష్‌తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయంలో సుమన్ భరత్ తరచూ భార్యను వేధించేవాడు. దీంతో భర్తను వదిలించుకోవాలని నిర్ణయించుకున్న లావణ్య, తన తమ్ముడు పెండల రాజు, ప్రియుడు నరేష్‌తో కలిసి కుట్ర పన్నింది.
- 5 లక్షల సుపారీ.. మద్యం తాగించి హత్య
ములుగు జిల్లా గోవిందరావుపేటకు చెందిన చిరంశెట్టి వెంకటేశ్వర్లుకు సుమన్ భరత్‌ను చంపేందుకు రూ. 5 లక్షల సుపారీ ఇచ్చారు. ఇందుకోసం లావణ్య తన బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బులు సమకూర్చింది. పథకం ప్రకారం ఈనెల 3వ తేదీన సుమన్ భరత్‌ను మద్యం ఆశచూపి ములుగుకు పిలిపించారు. అక్కడ వెంకటేశ్వర్లు, భూక్యా రాకేష్ కలిసి మద్యం తాగించి, సుమన్ మత్తులో ఉన్నప్పుడు బీర్ బాటిల్‌తో తలపై కొట్టి చంపేశారు. అనంతరం పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగులబెట్టారు. భయానక విషయం ఏంటంటే.. నిందితులు సుమన్‌ను చంపుతున్నప్పుడు, తగులబెడుతున్నప్పుడు వీడియోలు తీసి లావణ్యకు చూపించారు.
- ఆధారాలు లేకుండా చేసే ప్రయత్నం
హత్య జరిగిన మరుసటి రోజు నిందితుడు వెంకటేశ్వర్లు కాలిపోయిన సుమన్ అస్థికలను (బొక్కలను) ఒక సంచిలో వేసి సమీపంలోని దయ్యాల వాగులో పారేశాడు. అటు లావణ్య ఏమీ తెలియనట్లు పరకాలలోని తన అత్తగారి ఇంటికి చేరుకుంది. ఏప్రిల్ 8న సుమన్ తండ్రి సాంబయ్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసుగా దర్యాప్తు ప్రారంభించిన పరకాల పోలీసులు, సాంకేతిక ఆధారాల సాయంతో నిందితులను పట్టుకున్నారు.
- నిందితుల అరెస్ట్ - సామాగ్రి స్వాధీనం
పోలీసులు నిందితులు చూపిన ఘటనా స్థలంలో కాలిపోయిన సిగరెట్ పీకలు, బూడిద, అస్థికలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వద్ద నుంచి వివిధ కంపెనీలకు చెందిన 6 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు.
- అరెస్టయిన నిందితులు
 1. మడికొండ లావణ్య (భార్య)
 2. ఇమ్మడి నరేష్ (ప్రియుడు)
 3. పెండల రాజు (లావణ్య తమ్ముడు)
 4. చిరంశెట్టి వెంకటేశ్వర్లు (కిరాయి హంతకుడు)
 5. భూక్యా రాకేష్ (సహకరించిన వ్యక్తి)
నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Tags:

భర్త హత్యకు రూ.5 లక్షల సుపారీ

- హత్య చేసి వీడియో తీసిన కిరాయి హంతకులు - ప్రియుడు తమ్ముడు తో కలిసి భర్తను అంతం చేసిన ఇల్లాలు- భర్తను చంపాక తగులబెట్టి.....
క్రైమ్ 
Read More...
భర్త హత్యకు రూ.5 లక్షల సుపారీ

ఎల్కతుర్తి ఎస్సైపై వేటు

ఏఆర్ కు అటాచ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు విచారణలో ఆరోపణలు నిర్ధారణ 
క్రైమ్ 
Read More...
ఎల్కతుర్తి ఎస్సైపై వేటు

పరకాలను కుదిపేసిన ‘కీల్ లేడీ’

పరకాలను కుదిపేసిన ‘కీల్ లేడీ’ అక్రమ సంబంధం నేపథ్యంలో భర్త హత్య..  చలువాయి వద్ద శవం ఆనవాళ్లు?  పోలీసులు దర్యాప్తు ముమ్మరం అక్షరదర్బార్, పరకాల:పరకాల పట్టణంలో...
Read More...
పరకాలను కుదిపేసిన ‘కీల్ లేడీ’

భర్తను హత్య చేసిన భార్య!

పరకాలలో సినీ పక్కిని తలపించే రీతిలో ఘోరం వివాహేతర సంబంధంతో ఓ వ్యక్తితో కలిసి దారుణం  పోలీసు స్టేషన్ కు చేరుకున్న మృతుడి బంధువులు
క్రైమ్ 
Read More...
భర్తను హత్య చేసిన భార్య!

రాజకీయ కక్షతో అకారణంగా నన్ను తొలగించారు*

*రాజకీయ కక్షతో అకారణంగా నన్ను తొలగించారు* *సీనియర్ మేట్ గా కల్పించాలని ఉన్నతాధికారులను వేడుకున్న బాధితుడు* అక్షర దర్బార్ శాయంపేట : ఉపాధి హామీ పథకం పనిలో...
Read More...
రాజకీయ కక్షతో అకారణంగా నన్ను తొలగించారు*