రాజకీయ కక్షతో అకారణంగా నన్ను తొలగించారు*

రాజకీయ కక్షతో అకారణంగా నన్ను తొలగించారు*

*రాజకీయ కక్షతో అకారణంగా నన్ను తొలగించారు*

*సీనియర్ మేట్ గా కల్పించాలని ఉన్నతాధికారులను వేడుకున్న బాధితుడు*

అక్షర దర్బార్ శాయంపేట :

ఉపాధి హామీ పథకం పనిలో ఎలాంటి తప్పులు చేయకుండా తనను రాజకీయ కక్ష తోనే సీనియర్ మేట్ నుండి తొలగించారని కాట్రపల్లి గ్రామానికి చెందిన బాధితుడు రంజిత్ ఆరోపించాడు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రంజిత్ మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాల నుండి నాకు ఎలాంటి జీతం లేకున్న గ్రామంలో సీనియర్ మేటుగా చేస్తున్నాను.నేను సీనియర్ మేట్ గా ఉన్న కాలంలో సోషల్ ఆడిట్ జరిగినప్పుడు ఎప్పుడు ఎలాంటి అభ్యంతరాలు నాపై వ్యక్తం కాలేదు.సామాజిక తనిఖీల సమయంలో కూడా తనపై ఇలాంటి తప్పులు నమోదు కాలేదని ఆయన పేర్కొన్నారు.స్థానిక సర్పంచ్ నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నాడని తెలిపాడు.రాజకీయ కక్షతో అకారణంగా నన్ను ఓర్వలేకనే తొలగించారని ఆరోపించాడు.నా సీనియర్ మేట్ పనిని నాకు ఇప్పించాలనీ ఈ సందర్భంగా ఉన్నతాధికారులను వేడుకున్నాడు.అనంతరం ఉప సర్పంచ్ బిక్షపతి మాట్లాడుతూ పాలకవర్గానికి తెలియకుండా తన లెటర్ ప్యాడ్ మీద కొత్త మెట్ల పేర్లను అధికారులకు పంపినట్లు తెలిపారు.సర్పంచ్ తనకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం సరైనది కాదని అన్నారు.అతను ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు.

Tags:

పరకాలకు పారిశుధ్య ముప్పు

  పరకాలకు పారిశుధ్య ముప్పు వర్షాల వేళ వార్డుల్లో పేరుకుపోతున్న చెత్త..  స్వైర విహారం చేస్తున్న పందులు..  దుర్వాసనతో ప్రజల అవస్థలు..  అక్షరదర్బార్,పరకాల:వర్షాకాలంలో పరకాల పట్టణంలో పారిశుధ్య...
Read More...
పరకాలకు పారిశుధ్య ముప్పు

పీడీఎస్ రైస్ పట్టివేత

- 62 బస్తాల బియ్యం స్వాధీనం - టాస్క్‌ఫోర్స్ దాడిలో అక్రమ నిల్వ బట్టబయలు
వార్తలు 
Read More...
పీడీఎస్ రైస్ పట్టివేత

ఏసీబీ వలలో తహశీల్దార్

- చేర్యాల తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు - రూ.70 వేల లంచంతో పట్టుబడిన తహశీల్దార్ 
క్రైమ్ 
Read More...
ఏసీబీ వలలో తహశీల్దార్

గోదావరి జలాలను వృదా చేయొద్దు

- వెంటనే కన్నెపల్లి మోటార్లు ప్రారంభించాలి- లేకపోతే 50 వేల మంది రైతులతో వచ్చి పంప్‌హౌస్‌ను మేమే ఆన్ చేస్తాం- కేసీఆర్‌కు వారం రోజులు...
వార్తలు 
Read More...
గోదావరి జలాలను వృదా చేయొద్దు

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ అధ్యక్షుడిగా నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా పంచమనేని భాస్కరరావు అక్షరదర్బార్,నడికూడ: నడికూడ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మండల జర్నలిస్టుల...
Read More...
నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ