బతుకమ్మ వేళా.. బిందెలతో బతుకు పోరాటం!

బతుకమ్మ వేళా.. బిందెలతో బతుకు పోరాటం!

బతుకమ్మ వేళా.. బిందెలతో బతుకు పోరాటం!

13వ వార్డులో నెల రోజులుగా నీటి కటకట.. 

కమిషనర్‌, కౌన్సిలర్‌ పట్టించుకోవడం లేదంటూ కాలనీవాసుల ఆగ్రహం 


అక్షరదర్బార్,పరకాల: 
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ పండుగ వేళ పరకాల పట్టణంలోని 13వ వార్డు ఎస్సీ కొత్తవాడలో మహిళలకు నీటి కష్టాలు తప్పడం లేదు. నెల రోజులుగా నీటి సరఫరా లేకపోవడంతో తాగునీటి కోసం బిందెలు పట్టుకుని బోర్ల వద్దకు పరుగులు తీయాల్సి వస్తోందని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పండుగ సందర్భంగా ఇళ్లకు వచ్చిన ఆడబిడ్డలు, బంధువులతో సందడిగా ఉండాల్సిన సమయంలో నీటి కోసం బిందెలు పట్టుకుని తిరగాల్సిన దుస్థితి నెలకొందని వాపోతున్నారు. నీటి సమస్యపై స్థానిక కౌన్సిలర్‌కు, మున్సిపల్‌ కమిషనర్‌కు సమాచారం ఇచ్చినా స్పందన లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు.
పండుగ పూట కూడా నీటి కష్టాలు తప్పడం లేదని, తమ సమస్యను పరిష్కరించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్‌ అధికారులు స్పందించి 13వ వార్డులో నీటి సరఫరాను పునరుద్ధరించి తమ ఇబ్బందులు తొలగించాలని మహిళలు కోరుతున్నారు.

Tags:
మీకు నచ్చే మరిన్ని

వరికి ప్రత్యామ్నాయ పంటలే మేలు

  రైతులు వ్యవసాయ భూముల సంరక్షణ, నేల ఆరోగ్యం, నీటి వనరుల పరిరక్షణతో పాటు స్థిరమైన వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని అదనపు కలెక్టర్ రవి సూచించారు. హసన్‌పర్తి
వరంగల్ 
Read More...
వరికి ప్రత్యామ్నాయ పంటలే మేలు

వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం

వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం నీటి వనరులను సంరక్షిస్తూ ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించాలి అదనపు కలెక్టర్ రవి అక్షరదర్బార్,హసన్‌పర్తి:  రైతులు వరి పెట్టుబడి...
వరంగల్ 
Read More...
వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం

నాణ్యమైన కరెంటు ఇస్తాం

- డిజిటల్ మీడియా ప్రతినిధుల చిట్ చాట్ లో టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి
వార్తలు 
Read More...
నాణ్యమైన కరెంటు ఇస్తాం

నకిలీ విత్తనాలతో నిండా మునిగాం!

నకిలీ విత్తనాలతో నిండా మునిగాం! విక్రమ్ ట్రేడర్స్‌ ఎదుట వరి రైతుల ఆందోళన..  150 ఎకరాల్లో పంట నష్టం..  పరిహారం చెల్లించాలని డిమాండ్‌ అక్షరదర్బార్,పరకాల: నకిలీ వరి...
వరంగల్ 
Read More...
నకిలీ విత్తనాలతో నిండా మునిగాం!

రైస్ మిల్లర్ల ఎన్నికల్లో హైడ్రామా!

- అధికార పార్టీ జోక్యం.. 'రెండు' వర్గాల సవాల్
రాజకీయం 
Read More...
రైస్ మిల్లర్ల ఎన్నికల్లో హైడ్రామా!