చిరు వ్యాపారులకు ఇనుగాల ట్రస్ట్ అండ
అక్షర దర్బార్,పరకాల :
మండుటెండలో జీవనోపాధి కోసం రోడ్డుపై కూరగాయలు, పండ్లు అమ్ముకుంటున్న చిరు వ్యాపారులకు ఇనుగాల ట్రస్ట్ తోడ్పాటు అందించింది. హనుమకొండ జిల్లా ఇనుగాల ట్రస్ట్ జిల్లా అధ్యక్షుడు ఆదేశాల మేరకు, ఇనుగాల యువసేన పరకాల పట్టణ అధ్యక్షుడు బొచ్చు రాకేష్ ఆధ్వర్యంలో పట్టణంలో గొడుగుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఫుట్‌పాత్‌పై వ్యాపారం చేస్తున్న వారు ఎండ తీవ్రతలో ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన ట్రస్ట్ సభ్యులు ఈ విషయాన్ని ఇనుగాల వెంకటరామిరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి గొడుగులు అందజేయాలని సూచించారు. దాంతో ట్రస్ట్ ఆధ్వర్యంలో వ్యాపారులకు గొడుగులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో యువసేన నాయకులు అజయ్, శరత్, జీవన్, సంజయ్, చందు తదితరులు, ఇనుగాల ట్రస్ట్ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.