ఆరబెట్టిన మిర్చి చోరీ

ఆరబెట్టిన మిర్చి చోరీ

  • 5 క్వింటాళ్ల మిర్చి అపహరణ
  • విలువ రూ.లక్ష.. పోలీసులకు ఫిర్యాదు
  • హనుమకొండ జిల్లాలో ఘటన

బావి వద్ద అరబెట్టిన మిర్చి మాయం..

మల్లక్కపేట–నాగారం శివారులో చోరీ…

 పరకాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

అక్షరదర్బార్, పరకాల:
హన్మకొండ జిల్లా పరకాల మండలం మల్లక్కపేట–నాగారం గ్రామాల శివారులో రైతు అరబెట్టిన మిర్చిని గుర్తు తెలియని దొంగలు అపహరించిన ఘటన చోటుచేసుకుంది. మల్లక్కపేట గ్రామానికి చెందిన దొమ్మటి బాబు అనే రైతు తన మిర్చిని బావి వద్ద అరబెట్టగా, అక్కడి నుంచి సుమారు 5 క్వింటాళ్ల మిర్చిని దొంగలు ఎత్తుకెళ్లినట్లు సమాచారం.
అపహరణకు గురైన మిర్చి విలువ లక్ష రూపాయలకు పైగా ఉంటుందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై బాధితుడు పరకాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఇటీవల మిర్చికి మార్కెట్లో డిమాండ్ పెరగడంతో కొంతమంది ముఠాలు చోరీలకు పాల్పడుతున్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా పుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు.
మిర్చి నిల్వలను పొలాల్లో లేదా బావుల వద్ద అరబెట్టే రైతులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఈ ఘటనతో పరిసర గ్రామాల రైతుల్లో ఆందోళన నెలకొంది.

Tags:

ఎల్కతుర్తి ఎస్సైపై వేటు

ఏఆర్ కు అటాచ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు విచారణలో ఆరోపణలు నిర్ధారణ 
క్రైమ్ 
Read More...
ఎల్కతుర్తి ఎస్సైపై వేటు

పరకాలను కుదిపేసిన ‘కీల్ లేడీ’

పరకాలను కుదిపేసిన ‘కీల్ లేడీ’ అక్రమ సంబంధం నేపథ్యంలో భర్త హత్య..  చలువాయి వద్ద శవం ఆనవాళ్లు?  పోలీసులు దర్యాప్తు ముమ్మరం అక్షరదర్బార్, పరకాల:పరకాల పట్టణంలో...
Read More...
పరకాలను కుదిపేసిన ‘కీల్ లేడీ’

భర్తను హత్య చేసిన భార్య!

పరకాలలో సినీ పక్కిని తలపించే రీతిలో ఘోరం వివాహేతర సంబంధంతో ఓ వ్యక్తితో కలిసి దారుణం  పోలీసు స్టేషన్ కు చేరుకున్న మృతుడి బంధువులు
క్రైమ్ 
Read More...
భర్తను హత్య చేసిన భార్య!

రాజకీయ కక్షతో అకారణంగా నన్ను తొలగించారు*

*రాజకీయ కక్షతో అకారణంగా నన్ను తొలగించారు* *సీనియర్ మేట్ గా కల్పించాలని ఉన్నతాధికారులను వేడుకున్న బాధితుడు* అక్షర దర్బార్ శాయంపేట : ఉపాధి హామీ పథకం పనిలో...
Read More...
రాజకీయ కక్షతో అకారణంగా నన్ను తొలగించారు*

ఏసీబీ పంజా

లంచం తీసుకుంటూ  పట్టుపడిన ఎంఈవో, స్కూల్ అసిస్టెంట్ అరెస్టు, విచారణ
క్రైమ్ 
Read More...
ఏసీబీ పంజా