కాంగ్రెస్ వశమైన పరకాల

కాంగ్రెస్ వశమైన పరకాల

- చివరి వరకు ఉత్కంఠ రేపిన ఫలితాలు 

  • 22 వార్డుల్లో కాంగ్రెస్ కు 13, బీఆర్ఎస్ కు 6, బీజేపీకి 3
  • మున్సిపాలిటీ చైర్మన్ పదవిని దక్కించుకోనున్న కాంగ్రెస్

 

పరకాల మున్సిపాలిటీపై కాంగ్రెస్ విజయకేతనం

13 స్థానాల్లో ఘన విజయం 

 బీఆర్ఎస్‌కు 6, బిజెపికి 3

17వ వార్డులో ఒకే ఓటుతో కాంగ్రెస్ గెలుపు

మాజీ చైర్మన్ మార్త రాజభద్రయ్యకు ఎదురుదెబ్బ


అక్షరదర్బార్, పరకాల:
పరకాల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడగా కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. మొత్తం 22 వార్డుల్లో కాంగ్రెస్ 13 స్థానాలను కైవసం చేసుకొని ఆధిపత్యాన్ని చాటింది. బిఆర్ఎస్ 6 స్థానాలకు, బిజెపి 3 స్థానాలకు పరిమితమయ్యాయి. ఈనెల 16న జరిగే ఎన్నికల్లో ఈ మునిసిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ పార్టీ దక్కించుకోనుంది. మున్సిపాలిటీ చైర్మన్ గా పావుశెట్టి సునీల్ కుమార్ ఎన్నికయ్యే అవకాశం ఉంది.

వార్డువారీ ఫలితాలు

1వ వార్డు – వెంకట స్వామి దుబాసి (బిఆర్ఎస్)
2వ వార్డు – శ్యామల (బిఆర్ఎస్)
3వ వార్డు – పోరండ్ల మౌనిక (కాంగ్రెస్)
4వ వార్డు – ఏకు దివ్య (కాంగ్రెస్)
5వ వార్డు – గొడుగు రజిత (బిఆర్ఎస్)
6వ వార్డు – రాణి తుమ్మల (బిఆర్ఎస్)
7వ వార్డు – సునీల్ కుమార్ పావుశెట్టి (కాంగ్రెస్)
8వ వార్డు – నల్లెల కుమార్ (కాంగ్రెస్)
9వ వార్డు – బెజ్జంకి పూర్ణాచారి (బిజెపి)
10వ వార్డు – లావణ్య పసుల (కాంగ్రెస్)
11వ వార్డు – గుడెల్లి సాధన్ కుమార్ (కాంగ్రెస్)
12వ వార్డు – ఆకుల లావణ్య (బిజెపి)
13వ వార్డు – మాధవి లత (కాంగ్రెస్)
14వ వార్డు – పడిదల దీప్తి (బిఆర్ఎస్)
15వ వార్డు – విజయ్ కుమార్ (బిజెపి)
16వ వార్డు – బండి శ్రీదర్ (కాంగ్రెస్)
17వ వార్డు – బొచ్చు సుభద్ర (కాంగ్రెస్)
18వ వార్డు – రేగూరి కరుణ (బిఆర్ఎస్)
19వ వార్డు – శ్రీనివాస్ కొయ్యడ (కాంగ్రెస్)
20వ వార్డు – పాలకుర్తి శ్రీనివాస్ (కాంగ్రెస్)
21వ వార్డు – సూదమల్ల రమేష్ (కాంగ్రెస్)
22వ వార్డు – అల్లే దశరథం (కాంగ్రెస్)

ఉత్కంఠ రేపిన 17వ వార్డు

పరకాల మున్సిపాలిటీ 17వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బొచ్చు సుభద్ర కేవలం ఒకే ఓటు తేడాతో బిఆర్ఎస్ అభ్యర్థి శనిగరం రజనీపై విజయం సాధించడం విశేషంగా నిలిచింది. ఈ ఫలితం స్థానికంగా తీవ్ర ఉత్కంఠ రేపింది.

మాజీ చైర్మన్‌కు ఎదురుదెబ్బ

మున్సిపల్ మాజీ చైర్మన్ మార్త రాజభద్రయ్య 11వ వార్డులో ఓటమి పాలవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

బిఆర్ఎస్ అంచనాలకు భిన్నంగా ఫలితాలు

ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ విజయం సాధిస్తుందని భావించిన ఆ పార్టీ నాయకులకు ఫలితాలు నిరాశ కలిగించాయి. మరోవైపు కాంగ్రెస్ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించి ప్రతి వార్డులో చురుకైన ప్రచారం నిర్వహించడంతో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది.
పరకాల మున్సిపల్‌పై కాంగ్రెస్ జెండా ఎగరవేయడంతో స్థానిక రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేచింది.

Tags:

కాంగ్రెస్ వశమైన పరకాల

- చివరి వరకు ఉత్కంఠ రేపిన ఫలితాలు  22 వార్డుల్లో కాంగ్రెస్ కు 13, బీఆర్ఎస్ కు 6, బీజేపీకి 3 మున్సిపాలిటీ చైర్మన్ పదవిని దక్కించుకోనున్న...
రాజకీయం 
Read More...
కాంగ్రెస్ వశమైన పరకాల

భార్యపై కోపంతో అత్త, బావమరిదిపై కత్తితోదాడి

- హనుమకొండ న్యూశాయంపేటలో ఘటన 
Read More...
భార్యపై కోపంతో అత్త, బావమరిదిపై కత్తితోదాడి

సర్పంచ్ సనత్ చోరవతో అంగన్వాడీకి పునర్నిర్మాణం

సర్పంచ్ సనత్ చోరవతో అంగన్వాడీకి పునర్నిర్మాణం   రూ.1.80 లక్షలతో పాత స్కూల్ భవనానికి రిపేర్లు    జంగిలి రత్నాకర్ ఉదారత అక్షర దర్బార్, పరకాల:పరకాల మండలం అలియాబాద్...
Read More...
సర్పంచ్ సనత్ చోరవతో అంగన్వాడీకి పునర్నిర్మాణం

“మా నానమ్మను గెలిపించండి” 

“మా నానమ్మను గెలిపించండి”    చిన్నారి అభ్యర్థనకు కరిగిన ఓటర్ల హృదయాలు అక్షరదర్బార్, పరకాల:పరకాల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 12వ వార్డులో ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది....
Read More...
“మా నానమ్మను గెలిపించండి” 

మేడారం.. ట్రాఫిక్ నరకం

టెక్నాలజీ తుస్సు.. యంత్రాంగం ఫస్సు! మేడారం - హనుమకొండ 11 గంటల జర్నీ 
వార్తలు 
Read More...
మేడారం.. ట్రాఫిక్ నరకం