ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు.
తెలంగాణ కోసం తన ఇల్లు ఉద్యమానికి ఇచ్చిన త్యాగి.
పద్మశాలి ఐక్యతకు సహకార సంఘాల మార్గదర్శకుడు.
డాక్టర్ పి. రాజేశ్వర ప్రసాద్.
అక్షర దర్బార్, పరకాల:
పరకాల పట్టణంలో తెలంగాణ గాంధీ, మాజీ మంత్రి, పద్మశాలి ముద్దుబిడ్డ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. పట్టణ అధ్యక్షులు బాసని దయాకర్ ఆధ్వర్యంలో బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విగ్రహ కమిటీ చైర్మన్ డాక్టర్ పి. రాజేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ కోసం తన ఇల్లు ఉద్యమానికి అడ్డాగా చేసి, మంత్రి పదవికి రాజీనామా చేసిన బాపూజీ త్యాగస్ఫూర్తి గుర్తించాల్సినదని అన్నారు. పద్మశాలి ఐక్యతకు సహకార సంఘాలను ఏర్పాటు చేసి మార్గదర్శకుడిగా నిలిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ మంత్రి కాశయ్య, చిదురాల దేవేందర్, రాచర్ల అశోక్, మెండు రవీందర్, దుంపేటి నాగరాజు, సామంతుల రాజేందర్, తౌటం మధు, కుమారస్వామి, సతీష్, శ్రీధర్, నరేందర్, సంతోష్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.