“మా నానమ్మను గెలిపించండి” 

“మా నానమ్మను గెలిపించండి” 

“మా నానమ్మను గెలిపించండి” 

 చిన్నారి అభ్యర్థనకు కరిగిన ఓటర్ల హృదయాలు

అక్షరదర్బార్, పరకాల:
పరకాల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 12వ వార్డులో ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ వార్డులో భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీ అభ్యర్థి గంట కళావతి ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటు వేసి ఆశీర్వదించాలని ఓటర్లను అభ్యర్థించారు.
ఈ సందర్భంగా ఆమె వెంట ఉన్న మనవరాలు “మా నానమ్మకు ఓటు వేసి గెలిపించండి” అంటూ ఓటర్లను మనస్ఫూర్తిగా కోరింది. చిన్నారి అమాయకమైన అభ్యర్థనకు ఓటర్ల హృదయాలు కరిగిపోయాయి. ఆమెను ఆప్యాయంగా ఒడిలో కూర్చోబెట్టుకున్న ఓటర్లు, “మా ఓటు మీ నానమ్మకే, ఆమెనే కౌన్సిలర్‌గా గెలిపిస్తాం” అంటూ హామీ ఇచ్చారు.దీనితో ఆనందం వ్యక్తం చేసిన చిన్నారి ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపగా, ఆ దృశ్యం అక్కడున్న వారందరినీ భావోద్వేగానికి గురి చేసింది. ఈ సంఘటన ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Tags:

కసితో ఎమ్మెల్యేనయ్య

- బిజినెస్ మ్యాన్ ను కావాలనే కాయిస్ ఉండే నాకు - మా అన్న ఎమ్మెల్యే కావాలన్న టార్గెట్ ఉండేది - అయితే ఒక్క అవమానం నన్ను...
రాజకీయం 
Read More...
కసితో ఎమ్మెల్యేనయ్య

రేవూరి, సీఎంపై వ్యాఖ్యలు సరికాదు

రేవూరి, సీఎంపై వ్యాఖ్యలు సరికాదు - కొండా సుస్మిత పటేల్‌ తీరుపై కాంగ్రెస్‌ నేతల మండిపాటు.. - క్షమాపణ చెప్పాలని డిమాండ్ - ఇక్కడ మంత్రి సుష్మతనా...
Read More...
రేవూరి, సీఎంపై వ్యాఖ్యలు సరికాదు

పరకాల కాంగ్రెస్ లో పొలిటికల్ సెగ

- రేవంత్ వ్యాఖ్యలకు కొండా సుస్మిత కౌంటర్- డైపర్లు వేసుకునే వ్యక్తికి మళ్లీ టికెట్ ఇస్తారా? అని ప్రశ్న- “పరకాల నాదే.. టికెట్ ఇచ్చేది...
రాజకీయం 
Read More...
పరకాల కాంగ్రెస్ లో పొలిటికల్ సెగ

వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా

- రిజర్వేషన్లు మారితే నా సతీమణి బరిలో ఉంటారు- పార్టీ నిర్ణయిస్తే మేయర్ గా బరిలోకి.. - నేను పార్టీ విధేయుడిని.. పార్టీ నిర్ణయమే శిరోధార్యం...
రాజకీయం 
Read More...
వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా

పెద్ది విగ్రహం తొలగింపు

- నర్సంపేటలో భారీగా పోలీసుల మోహరింపు.. ఉద్రిక్తత- బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్ట్
రాజకీయం 
Read More...
పెద్ది విగ్రహం తొలగింపు