పద్మశాలీల గణపతి వద్ద అన్న ప్రసాదం.
42 సంవత్సరాలుగా వినాయక చవితి వేడుకలు
అక్షర దర్బార్ శాయంపేట :
శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో పద్మశాలీల కులస్తులు ఆధ్వర్యంలో గణపతి వద్ద అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు.కాగా 42 ఏళ్లుగా వినాయక చవితి పండుగను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు.ఈ సంవత్సరం 2025 ఆగష్టు 27న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజున మండపంలో ఆగమనం చేసి వినాయకుని విగ్రహానికి కలస్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తులు భక్తిని చాటుకుంటున్నారు.కాగా మొదట 1983లో ప్రారంభించి ఒక నిర్దిష్ట ప్రాంతంలో 42 సంవత్సరాలుగా ఈ పండుగను నిరాటంకంగా, నవరాత్రి ఉత్సవాలను గొప్పగా జరుపుతున్నామని కులస్తులు గర్వంగా చెప్తున్నారు.ప్రతి సంవత్సరం విగ్రహనికి దాతలుగా ఉండటం ప్రత్యేకత.ఈ ఉత్సవాలలో భాగంగా భజనలు, అన్న ప్రసాద కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.ఉత్సవాల అనంతరం విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్ళి నిమర్జనం చేస్తామని తెలిపారు.