వృత్తికే మచ్చ....
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కీచక పర్వం..
వృత్తికే మచ్చ....
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కీచక పర్వం..
విద్యార్థినిని వేధించిన అధ్యాపకుడు..
అక్షర దర్బార్, పరకాల:
విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులకు మార్గదర్శకుడిగా ఉండాల్సిన అధ్యాపకుడే కీచకుడిగా మారిన ఘటన పరకాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చోటుచేసుకుంది. కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తున్న మోరే అశోక్ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.ఈ విషయమై తల్లిదండ్రులు కళాశాల ప్రిన్సిపాల్ సంతోష్ కు ఫిర్యాదు చేయగా, ప్రాథమిక విచారణ అనంతరం పై అధికారులకు నివేదిక పంపినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. విద్యార్థుల భద్రత, గౌరవం కాపాడాల్సిన విద్యాసంస్థల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగించే విషయమని పలువురు అభిప్రాయ పడుతున్నారు. విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తనకు పాల్పడిన అధ్యాపకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యా దేవాలయాలుగా భావించే కళాశాలల్లోనే విద్యార్థినులు భయంతో ఉండాల్సిన పరిస్థితి రావడం వ్యవస్థపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది.