ఇష్ట రాజ్యాంగ మట్టి తరలింపు..

పట్టించుకోని అధికారులు!
ఇష్ట రాజ్యాంగ మట్టి తరలింపు..

ఇష్ట రాజ్యాంగ మట్టి తరలింపు.. 
పట్టించుకోని అధికారులు!

అక్షర దర్బార్, పరకాల:
 పరకాల మండలం కామరెడ్డి పల్లి గ్రామంలో ఆదివారం అధికారులకు సెలవు దినం కావడంతో మట్టి మాఫియా చెలరేగింది. ఉదయం మొదలుకుని ట్రాక్టర్లతో గ్రామ పరిసరాల బోడు నుండి ఎకధాటిగా మట్టిని తరలిస్తున్నారు. విషయం అధికారులకు తెలియజేసినా, ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామంలో అనధికారికంగా జరుగుతున్న ఈ మట్టి తరలింపుపై సంబంధిత విభాగాలు కళ్లుమూసుకోవడం స్థానికుల ఆగ్రహానికి గురి చేస్తోంది. “రోజూ ఇలాగే మట్టిని తీసుకెళ్తున్నారు. చెప్పినా పట్టించుకోవడం లేదు” అని గ్రామస్తులు వాపోతున్నారు.

పర్మిషన్ ఎవరికీ ఇవ్వలేదు:
కామరెడ్డి పల్లి గ్రామంలో మట్టి తరలించడానికి ఎవరికి అనుమతి ఇవ్వలేదని పరకాల తహసీల్దార్ విజయలక్ష్మి స్పష్టం చేశారు. “మట్టి తవ్వకానికి ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు. విషయం దృష్టికి తీసుకువచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటాం” అని ఆమె తెలిపారు.

Tags:

టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి

టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి- 97 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత - నాలుగు వాహనాలు సీజ్- పీడీఎస్ రైస్ అక్రమ రవాణాపై విచారణ...
Read More...
టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి

ఇష్ట రాజ్యాంగ మట్టి తరలింపు..

ఇష్ట రాజ్యాంగ మట్టి తరలింపు.. పట్టించుకోని అధికారులు! అక్షర దర్బార్, పరకాల:  పరకాల మండలం కామరెడ్డి పల్లి గ్రామంలో ఆదివారం అధికారులకు సెలవు దినం కావడంతో గ్రామంలో...
Read More...
ఇష్ట రాజ్యాంగ మట్టి తరలింపు..

రూ.1.86 కోట్ల ధాన్యం కొనుగోలు మోసం బహిర్గతం.

రూ.1.86 కోట్ల ధాన్యం కొనుగోలు మోసం బహిర్గతం.       నకిలీ రైతుల పేరుతో పెద్ద మొత్తంలో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం.      ఈఎఫ్‌టీ విచారణలో బహిర్గతం    అక్షర దర్బార్, శాయంపేట:...
Read More...
రూ.1.86 కోట్ల ధాన్యం కొనుగోలు మోసం బహిర్గతం.

వాట్సాప్ దక్కకపోతే ఏంటి? స్వదేశీ 'అరట్టై' వాడండి! - సుప్రీం కోర్టు సూచన

  అంతర్జాతీయ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు పోటీగా వచ్చిన స్వదేశీ యాప్ 'అరట్టై' (Arattai) పేరు ప్రస్తుతం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోనూ వినిపించింది. తన వాట్సాప్
వార్తలు  వరంగల్ 
Read More...
వాట్సాప్ దక్కకపోతే ఏంటి? స్వదేశీ 'అరట్టై' వాడండి! - సుప్రీం కోర్టు సూచన