భార్యపై కోపంతో అత్త, బావమరిదిపై కత్తితోదాడి

భార్యపై కోపంతో అత్త, బావమరిదిపై కత్తితోదాడి

- హనుమకొండ న్యూశాయంపేటలో ఘటన 

భార్యపై కోపంతో అత్త, బావమరిదిపై కత్తితోదాడి

హన్మకొండ న్యూశాయంపేటలో ఘటన

అక్షరదర్బార్, హనుమకొండ:
హన్మకొండ నగరంలోని న్యూశాయంపేట ప్రాంతంలో మంగళవారం ఉదయం కలకలం రేగింది. భార్యతో ఉన్న విభేదాల నేపథ్యంలో ఓ వ్యక్తి అత్త, బావమరిది పై కత్తితో దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. న్యూశాయంపేటకు చెందిన దంపతుల మధ్య గత కొన్ని రోజులుగా తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భార్యపై తీవ్ర కోపంతో ఉన్న భర్త, ఆమె ఇంట్లో లేని సమయంలో అత్త నివాసానికి వెళ్లి అక్కడ ఉన్న అత్త, బావమరిది పై అకస్మాత్తుగా కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో అత్త, బావమరిది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. ఈఎంటి మమత, పైలెట్ వేణు క్షతగాత్రులను హన్మకొండలోని రోహిణి ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:

పరకాలకు పారిశుధ్య ముప్పు

  పరకాలకు పారిశుధ్య ముప్పు వర్షాల వేళ వార్డుల్లో పేరుకుపోతున్న చెత్త..  స్వైర విహారం చేస్తున్న పందులు..  దుర్వాసనతో ప్రజల అవస్థలు..  అక్షరదర్బార్,పరకాల:వర్షాకాలంలో పరకాల పట్టణంలో పారిశుధ్య...
Read More...
పరకాలకు పారిశుధ్య ముప్పు

పీడీఎస్ రైస్ పట్టివేత

- 62 బస్తాల బియ్యం స్వాధీనం - టాస్క్‌ఫోర్స్ దాడిలో అక్రమ నిల్వ బట్టబయలు
వార్తలు 
Read More...
పీడీఎస్ రైస్ పట్టివేత

ఏసీబీ వలలో తహశీల్దార్

- చేర్యాల తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు - రూ.70 వేల లంచంతో పట్టుబడిన తహశీల్దార్ 
క్రైమ్ 
Read More...
ఏసీబీ వలలో తహశీల్దార్

గోదావరి జలాలను వృదా చేయొద్దు

- వెంటనే కన్నెపల్లి మోటార్లు ప్రారంభించాలి- లేకపోతే 50 వేల మంది రైతులతో వచ్చి పంప్‌హౌస్‌ను మేమే ఆన్ చేస్తాం- కేసీఆర్‌కు వారం రోజులు...
వార్తలు 
Read More...
గోదావరి జలాలను వృదా చేయొద్దు

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ అధ్యక్షుడిగా నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా పంచమనేని భాస్కరరావు అక్షరదర్బార్,నడికూడ: నడికూడ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మండల జర్నలిస్టుల...
Read More...
నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ