గ్రామాల్లో దొంగల హల్చల్

గ్రామాల్లో దొంగల హల్చల్

  • పల్సర్ బైక్, నగదు అపహరణ
  • కరెంట్ వైర్లూ చోరీ.. కేసుల నమోదు 

దొంగల హల్చల్.
- ఒక బైక్, రూ.15 వేల నగదు, కరెంటు వైర్లు అపహరణ.
- సంఘటన స్థలం వద్దనే
-  పోలీసుల కేసు నమోదు.

అక్షరదర్బార్, మొగుళ్లపల్లి: గత రెండు మూడు రోజుల నుండి భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల పరిధిలోని మూడు గ్రామాల్లో వేరువేరుగా దొంగలు హల్చల్ సృష్టించారు. దొంగలు ఒక గ్రామంలో రూ.1,60,000 విలువ చేసే పల్సర్ బైక్ ను దొంగతనం చేయగా.. మరో గ్రామంలో రూ.15 వేల నగదును అపహరించారు. ఇంకో గ్రామంలో రైతులకు సంబంధించిన కరెంటు వైర్లను దొంగలించారు. వరుస సంఘటనలతో మొగుళ్ళపల్లి మండలంలో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మొగుళ్ళపల్లి మండలం పర్లపల్లి గ్రామానికి చెందిన దొమ్మటి వెంకటేష్ అనే వ్యక్తికి సంబంధించిన ద్విచక్ర వాహనాన్ని దొంగలు అపహరించారు. అదే గ్రామంలోని బోనగిరి శశిరేఖ ఇంటిలో తలుపులు పగలగొట్టి ప్రవేశించి దొంగతనం చేసే ప్రయత్నం చేసి పారిపోయారు. అదే రోజు ఇప్పలపల్లి గ్రామానికి చెందిన గుర్రపు పుల్లమ్మ ఇంటిలో ఉదయం 10:30 గంటల మధ్య చొరబడి ఇంట్లో ఉన్న ఆల్మర పగలగొట్టి రూ.15 వేల నగదు దొంగలించి పరారయ్యారు. మండలంలోని మొట్లపల్లి గ్రామంలో రైతులకు సంబంధించిన విద్యుత్తు వైర్లను దొంగలించి దుండగులు పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు మొగుళ్ళపల్లి ఎస్సై ఎం సురేష్ బాధితుల ఇళ్ల వద్దకే వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆయన మొగుళ్లపల్లి ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నాలుగు కేసుల్లో బాధితుల ఇంటి వద్దనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం గమనార్ధం.

Tags:

వడ్ల డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు

వడ్ల డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు కాంట వేసి 10 రోజులు దాటినా ఖాతాల్లో జమ కాని చెల్లింపులు ట్యాబ్‌లో నమోదు ఆలస్యం, ఒటీపీ సమాచారం లేక...
Read More...
వడ్ల డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు

గంజాయి చాక్లెట్ల కలకలం

- ఒడిశా కేటుగాడి అరెస్ట్- ఎంజీఎం సర్కిల్ వద్ద పట్టుకున్న పోలీసులు..- 72 'సెవెన్ మైనర్ వతి' చాక్లెట్లు స్వాధీనం
క్రైమ్ 
Read More...
గంజాయి చాక్లెట్ల కలకలం

ఉపసర్పంచ్‌నే లైన్‌మ్యాన్‌!

ఉపసర్పంచ్‌నే లైన్‌మ్యాన్‌! అక్షరదర్బార్,శాయంపేట:  గ్రామంలో తరచూ ఎదురవుతున్న విద్యుత్‌ సమస్యలను అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో ఉపసర్పంచ్‌ సాయికృష్ణ స్వయంగా రంగంలోకి దిగారు.
Read More...
ఉపసర్పంచ్‌నే లైన్‌మ్యాన్‌!

ఫోన్ కాల్.. ఆపై మృతి!

ఫోన్ కాల్.. ఆపై మృతి! పరకాలలో యువకుడి అనుమానాస్పద మరణం.. హత్యేనని కుటుంబ సభ్యుల ఆరోపణ అక్షరదర్బార్, పరకాల: నడికూడ మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన మమ్మద్...
Read More...
ఫోన్ కాల్.. ఆపై మృతి!

పరకాల మున్సిపల్ కమిషనర్‌గా పోతరాజు పవన్

పరకాల మున్సిపల్ కమిషనర్‌గా పోతరాజు పవన్ అంజయ్య బదిలీ..  అక్షరదర్బార్,పరకాల:పరకాల మున్సిపాలిటీ నూతన కమిషనర్‌గా గ్రూప్-1 అధికారి పోతరాజు పవన్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు కమిషనర్‌గా...
Read More...
పరకాల మున్సిపల్ కమిషనర్‌గా పోతరాజు పవన్