సన్న బియ్యం పంపిణీలో కౌన్సిలర్లు
అక్షరదర్బార్, పరకాల:
దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సన్న బియ్యం పథకం ప్రజలకు ఉపయోగపడుతోందని స్థానిక ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ఈ నెలలో మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయడం ప్రత్యేకతగా నిలిచిందన్నారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిలకు కౌన్సిలర్లు కృతజ్ఞతలు తెలిపారు. పేద ప్రజలకు కడుపునిండా అన్నం అందించడంలో ప్రభుత్వం కృషి చేస్తోందని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో పరకాల మున్సిపాలిటీ కౌన్సిలర్లు కొయ్యడ శ్రీనివాస్, బండి శ్రీధర్, సుధమల్ల రమేష్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు స్వామి, బండి రాజేందర్, లబ్ధిదారులు పాల్గొన్నారు.