బాబు జగ్జీవన్ రామ్ జయంతి ..

బాబు జగ్జీవన్ రామ్ జయంతి ..

 బాబు జగ్జీవన్ రామ్ జయంతి ..

పూలమాలలు, కేక్ కట్ చేసి నివాళులర్పించిన నాయకులు

పండ్లు పంపిణీ చేసిన వైస్ చైర్ పర్సన్ ఏకు దివ్య

అక్షరదర్బార్, పరకాల:
స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘసంస్కర్త, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు పరకాల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ కేంద్రంలోని బస్టాండ్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని విగ్రహ ప్రతిష్టాపన వ్యవస్థాపక అధ్యక్షులు బొచ్చు అనంతరావు ఆధ్వర్యంలో నిర్వహించారు.
అనంతరం పరకాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఏకు దివ్య విద్యాసాగర్ కేక్ కట్ చేసి వేడుకలను కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబూజీగా ప్రసిద్ధి చెందిన జగ్జీవన్ రామ్ జాతీయ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడని కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన సిద్ధాంతాలను అనుసరించి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమం అనంతరం పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పరకాల మండలం ఎస్సీ విభాగం అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి, కౌన్సిలర్లు బొచ్చు మాధవిలత, జాన్సన్, బొచ్చు సుభద్ర, సాల్మన్, పాలకుర్తి శ్రీనివాస్, బొచ్చు శ్యామల బాబురావు, సుధమల్ల రమేష్, కాంగ్రెస్ నాయకులు బొచ్చు మోహన్, బొచ్చు జెమిని, దుప్పటి సదయ్య, ఆయిలిపెళ్లి స్వామి, బండి రాజు, బొచ్చు రాజు, జూపాక దేవమణి, రామన్న తదితరులు పాల్గొన్నారు.

Tags:

అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను

అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను 2 ఎకరాల 20 గుంటల పంట దగ్ధం తల్లడిల్లుతున్న రైతు కుటుంబం అక్షర దర్బార్,నడికూడ:నడికూడ మండలంలోని కంటత్మకూర్ గ్రామంలో రైతుకు...
Read More...
అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను

సంజయ్ దిష్టిబొమ్మ దగ్దం

- హనుమకొండ కాంగ్రెస్ భవన్ వద్ద మహిళా కాంగ్రెస్ ధర్నా - బండి సంజయ్ తనయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎర్రబెల్లి స్వర్ణ డిమాండ్
Read More...
సంజయ్ దిష్టిబొమ్మ దగ్దం

వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం

వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం అక్షరదర్బార్, శాయంపేట:శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన కందగట్ల నరహరి (50) (తండ్రి  కనుకయ్య) అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన...
Read More...
వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం

రగిలిన కరీంనగర్

గంగుల క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత  ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి బీజేపీ కార్యకర్తల యత్నం - కౌశిక్ రెడ్డి కారు, గంగుల క్యాంపు ఆఫీసులోని ఫర్నిచర్...
వార్తలు 
Read More...
రగిలిన కరీంనగర్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.    -మృతుడు మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామ నివాసి.    -కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న హుజురాబాద్ పోలీసులు.    అక్షర దర్బార్, మొగుళ్లపల్లి:...
Read More...
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి