తక్షణమే మున్సిపల్ ఎన్నికలు
- ఫిబ్రవరిలోనే జరిపేలా ప్లాన్ చేయాలని ఆదేశాలు
- బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్, ఎకో టూరిజం సర్క్యూట్
- రూ.143 కోట్లతో పొట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్
- కేబినెట్ సమావేశం నిర్ణయాలు
అక్షరదర్బార్, మేడారం
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో ఆదివారం ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. తొలిసారి హైదరాబాద్ అవతల మేడారంలో జరిగిన ఈ మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది అవేమిటంటే..
1. త్వరలో మున్సిపల్ ఎన్నికలు..
రాష్ట్రంలో పదవీ కాలం ముగిసిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలోని 2996 వార్డులకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం.
* ఫిబ్రవరిలో ఏర్పాట్లు: రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయినందున, ఫిబ్రవరిలోనే ఎన్నికలు జరిపేలా ప్లాన్ చేయాలని అధికారులకు ఆదేశం.
* పండుగల నిర్వహణ: ఫిబ్రవరిలో రంజాన్, శివరాత్రి ఉన్నందున భక్తులకు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎన్నికల షెడ్యూల్ ఉండాలని కేబినెట్ సూచించింది.
2. గోదావరి పుష్కరాలు - 2027
* తేదీలు: 2027 జూలై 27 నుంచి ఆగస్టు 3 వరకు పుష్కరాల నిర్వహణ.
* పుష్కర సర్క్యూట్: బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న అన్ని ఆలయాలను కలుపుతూ 'టెంపుల్ & ఎకో టూరిజం సర్క్యూట్' అభివృద్ధి.
* సమగ్ర నివేదిక: దేవాదాయ, అటవీ, పర్యాటక శాఖల సమన్వయంతో మార్చి 31 నాటికి పూర్తిస్థాయి ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశం.
3. హైదరాబాద్ మెట్రో & రవాణా
* మెట్రో స్వాధీనం: మెట్రో ఫేజ్-Iను L&T నుంచి స్వాధీనం చేసుకునే ప్రక్రియ వేగవంతం.
* ఫేజ్-II విస్తరణ: మెట్రో ఫేజ్-IIA (4 కారిడార్లు), ఫేజ్-IIB (3 కారిడార్లు) కోసం కేంద్రం అనుమతి రాకముందే, ₹2,787 కోట్ల అంచనా వ్యయంతో భూసేకరణకు ఆమోదం.
* కొత్త రోడ్డు: బంజారాహిల్స్ ICCC నుంచి శిల్పా లేఅవుట్ వరకు ట్రాఫిక్ తగ్గించేందుకు 9 కి.మీ.ల కొత్త రోడ్డు నిర్మాణం.
4. విద్య & ఉపాధి (కొత్త పోస్టులు)
* నల్గొండ: మహాత్మాగాంధీ యూనివర్సిటీ లా కాలేజీలో 24, ఫార్మసీ కాలేజీలో 28 కొత్త పోస్టుల మంజూరు.
* మహిళా యూనివర్సిటీ: వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో రిజిస్ట్రార్ పోస్టుకు ఆమోదం.
5. సాగునీరు & పట్టణాభివృద్ధి
* పొట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ (ములుగు): ₹143 కోట్లతో కొత్త ప్రాజెక్టు. దీని ద్వారా 5 గ్రామాలు, 30 చెరువులకు నీరు మరియు 7,500 ఎకరాలకు సాగునీరు అందుతుంది.
* ఎకో టౌన్: అబ్దుల్లాపూర్ మండలంలో 494 ఎకరాల్లో పర్యావరణహిత పట్టణం (Eco Town) అభివృద్ధికి TGIIC కి భూమి కేటాయింపు.