స్థానిక సంస్థల ఎన్నికల్లో బి.ఆర్.ఎస్ సత్తా చాటాలి..

స్థానిక సంస్థల ఎన్నికల్లో బి.ఆర్.ఎస్ సత్తా చాటాలి..

స్థానిక సంస్థల ఎన్నికల్లో బి.ఆర్.ఎస్ సత్తా చాటాలి..
 
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను  ప్రజలకు తెలపాలి.
 
స్ధానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం నేర్పాలి. 
 
బిఆర్ఎస్ పార్టీ అద్యక్షులు దురిశేట్టి చంద్రమౌళి.
 
 
అక్షర దర్బార్, పరకాల:
పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి ఆదేశాల మేరకు నడికూడ మండల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో పులిగిల్ల, రాయపర్తి గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించి స్థానిక సంస్థల్లో  మన పార్టీ సత్తా చాటాలని పేర్కొన్నారు. అదే విధంగా సోషల్ మీడియాలలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెల్లాలని కార్యకర్తలతో చర్చించడం జరిగింది. అదే విధంగా గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరు చేసిన అభివృద్ధి పనులను పూర్తి చేయకుండా, రైతులకి పంట సాగుకు తగినంత యూరియా స్టాక్ అందుబాటులొ ఉంచకుండా అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే స్ధానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని నడికూడ మండల బిఆర్ఎస్ పార్టీ అద్యక్షులు దురిశేట్టి చంద్రమౌళి(చందు) పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  బిఆర్ఎస్ జిల్లా నాయకులు మేడిపల్లి శోభన్, సమన్వయ కమిటీ సభ్యులు చందా కుమారస్వామి, నందికొండ జైపాల్ రెడ్డి, మచ్చ రవీందర్, బీముడి నాగిరెడ్డి, మండల యూత్ నాయకులు ముస్కే రాము, సురాబు శ్రీకాంత్, గుడికందుల శివ, రాయపర్తి గ్రామ కమిటీ అద్యక్షులు పోశాల బిక్షపతి, పులిగిల్ల గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి అల్లే మహేందర్, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యదర్శిలు, యూత్ నాయకులు, స్థానిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Tags:

పీడీఎస్ రైస్ పట్టివేత

- 62 బస్తాల బియ్యం స్వాధీనం - టాస్క్‌ఫోర్స్ దాడిలో అక్రమ నిల్వ బట్టబయలు
వార్తలు 
Read More...
పీడీఎస్ రైస్ పట్టివేత

ఏసీబీ వలలో తహశీల్దార్

- చేర్యాల తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు - రూ.70 వేల లంచంతో పట్టుబడిన తహశీల్దార్ 
క్రైమ్ 
Read More...
ఏసీబీ వలలో తహశీల్దార్

గోదావరి జలాలను వృదా చేయొద్దు

- వెంటనే కన్నెపల్లి మోటార్లు ప్రారంభించాలి- లేకపోతే 50 వేల మంది రైతులతో వచ్చి పంప్‌హౌస్‌ను మేమే ఆన్ చేస్తాం- కేసీఆర్‌కు వారం రోజులు...
వార్తలు 
Read More...
గోదావరి జలాలను వృదా చేయొద్దు

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ అధ్యక్షుడిగా నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా పంచమనేని భాస్కరరావు అక్షరదర్బార్,నడికూడ: నడికూడ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మండల జర్నలిస్టుల...
Read More...
నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ

భర్త హత్యకు భార్య స్కెచ్

- రూ.4 లక్షల సుపారీ- సింగారం మాజీ ఉప సర్పంచ్ యాకయ్య హత్య కేసు చేధన- యాకయ్య మృతి వెనుక అసలు నిజాలు బయటపెట్టిన...
క్రైమ్ 
Read More...
భర్త హత్యకు భార్య స్కెచ్