కాంగ్రెస్‌కు రోజులు దగ్గరపడ్డాయి..

కాంగ్రెస్‌కు రోజులు దగ్గరపడ్డాయి..

కాంగ్రెస్‌కు రోజులు దగ్గరపడ్డాయి..
మాజీ ఎమ్మెల్యే చల్లా.
 
అక్షర దర్బార్, పరకాల:
పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పరిపాలన చేతకావడం లేదని విమర్శించారు. ప్రజలు కాంగ్రెస్‌ను కర్రుకాల్చి వాతపెట్టే రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. సోమవారం ఆత్మకూర్, దామెర, గీసుగొండ మండలాల సమన్వయ కమిటీ సభ్యులతో ఆయన సమావేశం నిర్వహించారు. గ్రామాల వారీగా జరిగిన పార్టీ సమావేశాలపై సమీక్ష చేపట్టారు.
 
ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, తప్పుడు కేసులు పెట్టించే వారిని ఎవ్వరినీ వదలబోమని స్పష్టం చేశారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
 
“ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేయడం పట్ల ఇప్పుడు బాధపడుతున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం బీఆర్‌ఎస్‌కే పట్టం కట్టేలా సిద్ధంగా ఉన్నారు” అని ఆయన పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ శ్రేణులు కలిసికట్టుగా పనిచేసి విజయకేతనం ఎగురవేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో అభివృద్ధి బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో ఆత్మకూర్, దామెర, గీసుగొండ మండలాల సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు
Tags:

పరకాలలో ఒక్కసారిగా మంటలు

పరకాలలో ఒక్కసారిగా మంటలు సీఐ క్రాంతికుమార్ చొరవతో తప్పిన పేను ప్రమాదం అక్షరదర్బార్, పరకాల:పరకాల పట్టణంలోని ఇండియన్ గ్యాస్ గోదాం వెనుక ఉన్న పంట పొలాల్లో...
Read More...
పరకాలలో ఒక్కసారిగా మంటలు

అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను

అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను 2 ఎకరాల 20 గుంటల పంట దగ్ధం తల్లడిల్లుతున్న రైతు కుటుంబం అక్షర దర్బార్,నడికూడ:నడికూడ మండలంలోని కంటత్మకూర్ గ్రామంలో రైతుకు...
Read More...
అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను

సంజయ్ దిష్టిబొమ్మ దగ్దం

- హనుమకొండ కాంగ్రెస్ భవన్ వద్ద మహిళా కాంగ్రెస్ ధర్నా - బండి సంజయ్ తనయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎర్రబెల్లి స్వర్ణ డిమాండ్
Read More...
సంజయ్ దిష్టిబొమ్మ దగ్దం

వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం

వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం అక్షరదర్బార్, శాయంపేట:శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన కందగట్ల నరహరి (50) (తండ్రి  కనుకయ్య) అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన...
Read More...
వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం

రగిలిన కరీంనగర్

గంగుల క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత  ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి బీజేపీ కార్యకర్తల యత్నం - కౌశిక్ రెడ్డి కారు, గంగుల క్యాంపు ఆఫీసులోని ఫర్నిచర్...
వార్తలు 
Read More...
రగిలిన కరీంనగర్