సొంత గూటికి నడికూడ మాజీ జడ్పిటిసి, మాజీ ఎంపిటిసి

సొంత గూటికి నడికూడ మాజీ జడ్పిటిసి, మాజీ ఎంపిటిసి

సొంత గూటికి నడికూడ మాజీ జడ్పిటిసి, మాజీ ఎంపిటిసి

బీఆర్ఎస్‌లో చేరికల జోరు

ఆహ్వానించిన నాగుర్ల వెంకటేశ్వర్లు

అక్షర దర్బార్, పరకాల:
నడికూడ మండలానికి చెందిన మాజీ జడ్పిటిసి కోడెపాక సుమలత కర్ణాకర్,మాజీ ఎంపిటిసి సమ్మయ్య బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆదివారం తెలంగాణ రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు సమక్షంలో వారికి బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా నాగుర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బీఆర్ఎస్ తల్లిలాంటి పార్టీ అని, ప్రతి ఒక్కరినీ అక్కున చేర్చుకునే స్వభావం ఉన్న పార్టీగా పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని విమర్శించారు.మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. పార్టీలో చేరిన నాయకులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న విరక్తితో ఇప్పటికే భారీగా బీఆర్ఎస్‌లో చేరికలు జరుగుతున్నాయని, స్థానిక ఎన్నికలు పూర్తయ్యాక మరింత మంది కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.

Tags:

పరకాలకు పారిశుధ్య ముప్పు

  పరకాలకు పారిశుధ్య ముప్పు వర్షాల వేళ వార్డుల్లో పేరుకుపోతున్న చెత్త..  స్వైర విహారం చేస్తున్న పందులు..  దుర్వాసనతో ప్రజల అవస్థలు..  అక్షరదర్బార్,పరకాల:వర్షాకాలంలో పరకాల పట్టణంలో పారిశుధ్య...
Read More...
పరకాలకు పారిశుధ్య ముప్పు

పీడీఎస్ రైస్ పట్టివేత

- 62 బస్తాల బియ్యం స్వాధీనం - టాస్క్‌ఫోర్స్ దాడిలో అక్రమ నిల్వ బట్టబయలు
వార్తలు 
Read More...
పీడీఎస్ రైస్ పట్టివేత

ఏసీబీ వలలో తహశీల్దార్

- చేర్యాల తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు - రూ.70 వేల లంచంతో పట్టుబడిన తహశీల్దార్ 
క్రైమ్ 
Read More...
ఏసీబీ వలలో తహశీల్దార్

గోదావరి జలాలను వృదా చేయొద్దు

- వెంటనే కన్నెపల్లి మోటార్లు ప్రారంభించాలి- లేకపోతే 50 వేల మంది రైతులతో వచ్చి పంప్‌హౌస్‌ను మేమే ఆన్ చేస్తాం- కేసీఆర్‌కు వారం రోజులు...
వార్తలు 
Read More...
గోదావరి జలాలను వృదా చేయొద్దు

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ అధ్యక్షుడిగా నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా పంచమనేని భాస్కరరావు అక్షరదర్బార్,నడికూడ: నడికూడ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మండల జర్నలిస్టుల...
Read More...
నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ