నడికూడ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా రవీందర్ యాదవ్
అక్షర దర్బార్,నడికూడ:
పరకాల శాసనసభ సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుర్ర దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో సర్పంచుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నార్లపూర్ గ్రామ సర్పంచ్ పెద్ద బోయిన రవీందర్ యాదవ్ ను నడికూడ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అలాగే ప్రధాన కార్యదర్శిగా పెండ్లి లక్ష్మి, కార్యదర్శిగా కొంగటి తిరుపతి, ఉపాధ్యక్షుడిగా రాజు జగత్ ప్రకాష్ లను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అప్పం కుమార్ స్వామితో పాటు మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన పదాధికారులను అభినందిస్తూ మండల అభివృద్ధికి సమిష్టిగా పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు.