బిగ్ బ్రేకింగ్‌.. మానుకోట జిల్లాలో ఏసీబీ రైడ్స్

బిగ్ బ్రేకింగ్‌.. మానుకోట జిల్లాలో ఏసీబీ రైడ్స్

  • మాజీ జిల్లా రవాణాశాఖ అధికారి గౌస్ పాషా ఇంట్లో త‌నిఖీలు
  • గ‌త సంవ‌త్స‌రం అవినీతి ఆరోప‌ణ‌ల‌పై డీటీవో సస్పెన్ష‌న్‌
  • సుమారు రూ. 3 కోట్ల‌పైనే అక్ర‌మాస్తులు..

అక్ష‌ర‌ద‌ర్బార్‌, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాలో ఏసీబీ దాడులు క‌ల‌క‌లంరేపాయి. గతంలో మ‌హబూబాబాద్ జిల్లా రవాణాశాఖ అధికారిగా పని చేస్తూ అవినీతి ఆరోప‌ణ‌ల‌పై అరెస్టై స‌స్పెన్ష‌న్‌కు గురైన గౌస్ పాషా ఇంట్లో శుక్ర‌వారం ఉద‌యం అవినీతి నిరోధ‌క శాఖ అధికారులు త‌నిఖీలు చేప‌ట్టారు. ప్ర‌స్తుతం  అద్దె ఇంట్లో నివాసం ఉంటుండ‌గా అధికారుల‌ సోదాలు కొన‌సాగుతున్నాయి. 2024 ఆగ‌స్టులో మహబూబాబాద్ జిల్లా రవాణాశాఖ అధికారి గౌస్ పాషాపై ఏసీబీ కేసు నమోదైంది. ఈ కేసులో, ఏసీబీ అధికారులు గౌస్ పాషాను అదుపులోకి తీసుకుని విచారించారు. మహబూబాబాద్ ఆర్టీఏ కార్యాలయంపై దాడులు నిర్వహించి, గౌస్ పాషా ఇతర ఏజెంట్ల వద్ద రూ. 61,600 నగదు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 3 కోట్ల‌కుపైగా అక్ర‌మాస్తులు కూడ‌బెట్టిన‌ట్లు గ‌తంలో అధికారులు గుర్తించారు. తాజాగా మ‌రోమారు దాడులు నిర్వ‌హించ‌డం చ‌ర్చ‌నీయ‌మైంది. 

Tags:

డా.కాళీ ప్రసాద్ జన్మదిన వేడుకలు

డా.కాళీ ప్రసాద్ జన్మదిన వేడుకలు      పారిశుద్ధ కార్మికులకు దుస్తులు పంపిణీ చేసిన 9 వ వార్డు కౌన్సిలర్ పూర్ణచారి  కౌన్సిలర్ పూర్ణ చారిని అభినందించిన కార్మికులు. అక్షరదర్బార్,...
Read More...
డా.కాళీ ప్రసాద్ జన్మదిన వేడుకలు

కాంగ్రెస్ ఖాతాలో పరకాల

- చైర్మన్ గా పావుశెట్టి సునీల్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన సునీల్ వైస్ చైర్ పర్సన్ గా ఏకు దివ్య 
రాజకీయం 
Read More...
కాంగ్రెస్ ఖాతాలో పరకాల

చైర్మన్ గా కొమురయ్య

వైస్ చైర్మన్ గా శ్రీనివాస్ భూపాలపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం  ప్రమాణ స్వీకారం చేసిన కౌన్సిలర్లు
రాజకీయం 
Read More...
చైర్మన్ గా కొమురయ్య

ప్రమాణ స్వీకారం 

ప్రమాణ స్వీకారం  మొదట ప్రమాణం చేసిన మౌనిక    ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి హాజరు అక్షరదర్బార్, పరకాల:పరకాల మున్సిపాలిటీలో సోమవారం కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార...
Read More...
ప్రమాణ స్వీకారం 

కాంగ్రెస్ వశమైన పరకాల

- చివరి వరకు ఉత్కంఠ రేపిన ఫలితాలు  22 వార్డుల్లో కాంగ్రెస్ కు 13, బీఆర్ఎస్ కు 6, బీజేపీకి 3 మున్సిపాలిటీ చైర్మన్ పదవిని దక్కించుకోనున్న...
రాజకీయం 
Read More...
కాంగ్రెస్ వశమైన పరకాల