పేలిన మందుపాతర

పేలిన మందుపాతర

  • ముగ్గురు పోలీసుల దుర్మరణం
  • మృతులు గ్రేహౌండ్ జూనియర్ కమాండోలు?
  • బీజాపూర్ జిల్లాలో ఘటన

పేలిన మందుపాతర 
- ముగ్గురు పోలీసులు దుర్మరణం 
- బీజాపూర్ జిల్లాలో ఘటన

అక్షరదర్బార్, వాజేడు: తెలంగాణ- ఛత్తీస్ గడ్ రాష్ట్రాల సరిహద్దులో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలింది. ములుగు జిల్లా వాజేడు మండలం సరిహద్దులోని బీజాపూర్ జిల్లా లంకపల్లి అటవీ ప్రాంతంలో మందు పాతర పేలటంతో ముగ్గురు పోలీసులు దుర్మరణం చెందారు. ఆపరేషన్ కర్రెగుట్ట పేరుతో గత 17 రోజుల నుంచి తెలంగాణ- ఛత్తీస్ గడ్ సరిహద్దులో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మావోయిస్టుల కోసం ముమ్మర గాలింపు జరుపుతున్నారు. ఇప్పటివరకు మావోయిస్టులు అమర్చిన సుమారు 200 మందు పాతరలను పోలీసులు నిర్వీర్యం చేశారు. ఈ క్రమంలో లంకపల్లి అటవీ ప్రాంతంలో గురువారం మందు పాతర పేలడంతో ముగ్గురు పోలీసులు ప్రాణాలు కోల్పోగా ఒక ఎస్సై గాయపడినట్లు సమాచారం. మృతులు గ్రేహౌండ్ జూనియర్ కమాండోలు శ్రీధర్, సందీప్, పవణ్ కళ్యాణ్. వీరి మృతదేహాలను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన ఎస్సై రణధీర్ స్వగ్రామం వరంగల్ ములుగు రోడ్డు సమీపంలోని పైడిపల్లి అని తెలిసింది. మెరుగైన వైద్యం కోసం ఇతన్ని హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.  మందు పాతర మృతులకు నివాళి అర్పించేందుకు వరంగల్ కు డీజీపీ జితేందర్, గ్రేహౌండ్స్ డీజీ స్టీఫెన్ రవీంద్ర చేరుకున్నారు. గతంలో కూడా కర్రెగుట్టపై, పరిసరాల్లో మావోయిస్టులు అమర్చిన మందు పాతరలు, ఐఈడీలు పేలిన విషయం తెలిసిందే. లంకపల్లి మందుపాతర పేలుడు ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:

పరకాలకు పారిశుధ్య ముప్పు

  పరకాలకు పారిశుధ్య ముప్పు వర్షాల వేళ వార్డుల్లో పేరుకుపోతున్న చెత్త..  స్వైర విహారం చేస్తున్న పందులు..  దుర్వాసనతో ప్రజల అవస్థలు..  అక్షరదర్బార్,పరకాల:వర్షాకాలంలో పరకాల పట్టణంలో పారిశుధ్య...
Read More...
పరకాలకు పారిశుధ్య ముప్పు

పీడీఎస్ రైస్ పట్టివేత

- 62 బస్తాల బియ్యం స్వాధీనం - టాస్క్‌ఫోర్స్ దాడిలో అక్రమ నిల్వ బట్టబయలు
వార్తలు 
Read More...
పీడీఎస్ రైస్ పట్టివేత

ఏసీబీ వలలో తహశీల్దార్

- చేర్యాల తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు - రూ.70 వేల లంచంతో పట్టుబడిన తహశీల్దార్ 
క్రైమ్ 
Read More...
ఏసీబీ వలలో తహశీల్దార్

గోదావరి జలాలను వృదా చేయొద్దు

- వెంటనే కన్నెపల్లి మోటార్లు ప్రారంభించాలి- లేకపోతే 50 వేల మంది రైతులతో వచ్చి పంప్‌హౌస్‌ను మేమే ఆన్ చేస్తాం- కేసీఆర్‌కు వారం రోజులు...
వార్తలు 
Read More...
గోదావరి జలాలను వృదా చేయొద్దు

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ అధ్యక్షుడిగా నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా పంచమనేని భాస్కరరావు అక్షరదర్బార్,నడికూడ: నడికూడ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మండల జర్నలిస్టుల...
Read More...
నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ