గుండెపోటుతో ఎంపీడీవో మృతి

గుండెపోటుతో ఎంపీడీవో మృతి

  • చికిత్స కోసం హైదరాబాద్ బయలుదేరగా మార్గమధ్యంలో గుండెపోటు
  • వచ్చేనెల మే లో రిటైర్డ్ కానున్న ఎంపీడీవో

గుండెపోటుతో ఎంపీడీవో మృతి. 

(అక్షరదర్బార్, భూపాలపల్లి క్రైమ్)

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల అభివృద్ధి అధికారి మహమ్మద్ హుస్సేన్ గుండెపోటుతో శనివారం మృతి చెందారు. పరకాల పట్టణ కేంద్రానికి చెందిన మహ్మద్ హుస్సేన్ చిట్యాల ఎంపీడీవో కార్యాలయంలో టైపిస్టుగా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించి అంచలంచలుగా ఎదిగారు. చిట్యాల టైపిస్టు నుండి ప్రమోషన్ పొంది సూపరిండెంట్ గా విధులు నిర్వహిస్తూనే గత సంవత్సరం మొగుళ్ళపల్లి ఎంపీడీవో గా ప్రమోషన్ పై వచ్చారు. గత సంవత్సరం నుండి మొగుళ్ళ పల్లి ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తూ.. గత రెండు మూడు రోజుల నుండి అనారోగ్య కారణాలతో సెలవు పై వెళ్లారు. ఈ క్రమంలో శుక్రవారం అస్తవస్థకు గురైన హుస్సేన్ మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో గుండెపోటుతో మృతి చెందినట్లు తెలిసింది. ఎంపీడీవో హుస్సేన్ మరణ వార్తతో మొగుళ్ళపల్లి ఎంపీడీవో కార్యాలయం బోసిపోయింది. పలువురు ఉద్యోగులు సంతాపం తెలిపారు. ఎంపీడీవో హుస్సేన్ వచ్చేనెల మే లో రిటైర్డ్ కానున్నట్లు తెలిసింది,

Tags:

రూ.1.86 కోట్ల ధాన్యం కొనుగోలు మోసం బహిర్గతం.

రూ.1.86 కోట్ల ధాన్యం కొనుగోలు మోసం బహిర్గతం.       నకిలీ రైతుల పేరుతో పెద్ద మొత్తంలో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం.      ఈఎఫ్‌టీ విచారణలో బహిర్గతం    అక్షర దర్బార్, శాయంపేట:...
Read More...
రూ.1.86 కోట్ల ధాన్యం కొనుగోలు మోసం బహిర్గతం.

వాట్సాప్ దక్కకపోతే ఏంటి? స్వదేశీ 'అరట్టై' వాడండి! - సుప్రీం కోర్టు సూచన

  అంతర్జాతీయ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు పోటీగా వచ్చిన స్వదేశీ యాప్ 'అరట్టై' (Arattai) పేరు ప్రస్తుతం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోనూ వినిపించింది. తన వాట్సాప్
వార్తలు  వరంగల్ 
Read More...
వాట్సాప్ దక్కకపోతే ఏంటి? స్వదేశీ 'అరట్టై' వాడండి! - సుప్రీం కోర్టు సూచన

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు.

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు.    తెలంగాణ కోసం తన ఇల్లు ఉద్యమానికి ఇచ్చిన త్యాగి. పద్మశాలి ఐక్యతకు సహకార సంఘాల మార్గదర్శకుడు.      డాక్టర్   అక్షర...
Read More...
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు.

బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే రేవూరి సమీక్ష.

బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే రేవూరి సమీక్ష.    అక్షర దర్బార్, పరకాల: పరకాల పట్టణంలోని అంగడి మైదానం, దామెర చెరువు వద్ద జరుగనున్న బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లను...
Read More...
బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే రేవూరి సమీక్ష.