ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఎస్సారెస్సీ కెనాల్‌లో ప‌డిన కారు

ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఎస్సారెస్సీ కెనాల్‌లో ప‌డిన కారు

  • IMG-20250308-WA0017బాలుడి మృతి, తండ్రి కూతురు గల్లంతు 
  • కాలువ నుంచి భార్యను కాపాడిన స్థానికులు
  • వ‌రంగ‌ల్ జిల్లా తీగ‌రాజుప‌ల్లి వ‌ద్ద ఘోర ప్ర‌మాదం
  • గల్లంతైన తండ్రి, కూతురు కోసం గాలింపు

 

అక్షరదర్బార్, వరంగల్:

మ‌హ‌బూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండ‌లం మేచ‌రాజుప‌ల్లి గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. గ్రామానికి చెందిన సోమార‌పు ప్ర‌వీణ్ (30)తోపాటు ఆయ‌న కూతురు ఎస్సారెస్పీ కెనాల్‌లో ప‌డి గ‌ల్లంత‌య్యారు. ఈ దుర్ఘటనలో ప్రవీణ్ కొడుకు చిన్నారి సాయివర్దన్ (2) మృతి చెందగా భార్య ను స్థానికులు కాపాడారు. వ‌రంగ‌ల్‌లో నివాసం ఉంటున్న ప్ర‌వీణ్ భార్య ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి వ‌రంగ‌ల్ నుంచి కారులో స్వ‌గ్రామానికి వెళ్తున్నారు. ఈక్ర‌మంలోనే సంగెం మండ‌లం తీగ‌రాజుప‌ల్లి వ‌ద్ద ప్ర‌మాద‌వ‌శాత్తు ఎస్సారెస్పీ కెనాల్‌లో వీరు ప్ర‌యాణిస్తున్న కారు ప‌డిపోయింది. దీంతో ప్ర‌వీణ్‌, ఆయ‌న భార్య, ఇద్ద‌రు పిల్ల‌లు నీటిలో మునిగిపోయారు. గ‌మ‌నించిన స్థానికులు తాడు సాయంతో భార్య‌ కృష్ణవేణిని కాపాడారు. అప్పటికే బాలుడు సాయివర్దన్ మరణించాడు. ప్రవీణ్, ఆయన కూతురు చైత్ర సాయి (4) కారు సహా నీటిలో గ‌ల్లంత‌య్యారు. డ్రైవింగ్ సమయంలో ప్రవీణ్ కు చెస్ట్ పెయిన్ రావడంతో కారు ప్రమాదవశాత్తు కెనాల్ లో పడిపోయినట్లు తెలుస్తుంది. పోలీసులు గల్లంతయిన తండ్రీ కూతురు కోసం గాలిస్తున్నట్లు సమాచారం. సోమారపు ప్రవీణ్ ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ అని తెలిసింది. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. వివిధ రాజకీయ పార్టీల నేతలు సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.IMG-20250308-WA0015

WhatsApp Image 2025-03-08 at 1.20.48 PM

Tags:

రూ.1.86 కోట్ల ధాన్యం కొనుగోలు మోసం బహిర్గతం.

రూ.1.86 కోట్ల ధాన్యం కొనుగోలు మోసం బహిర్గతం.       నకిలీ రైతుల పేరుతో పెద్ద మొత్తంలో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం.      ఈఎఫ్‌టీ విచారణలో బహిర్గతం    అక్షర దర్బార్, శాయంపేట:...
Read More...
రూ.1.86 కోట్ల ధాన్యం కొనుగోలు మోసం బహిర్గతం.

వాట్సాప్ దక్కకపోతే ఏంటి? స్వదేశీ 'అరట్టై' వాడండి! - సుప్రీం కోర్టు సూచన

  అంతర్జాతీయ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు పోటీగా వచ్చిన స్వదేశీ యాప్ 'అరట్టై' (Arattai) పేరు ప్రస్తుతం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోనూ వినిపించింది. తన వాట్సాప్
వార్తలు  వరంగల్ 
Read More...
వాట్సాప్ దక్కకపోతే ఏంటి? స్వదేశీ 'అరట్టై' వాడండి! - సుప్రీం కోర్టు సూచన

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు.

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు.    తెలంగాణ కోసం తన ఇల్లు ఉద్యమానికి ఇచ్చిన త్యాగి. పద్మశాలి ఐక్యతకు సహకార సంఘాల మార్గదర్శకుడు.      డాక్టర్   అక్షర...
Read More...
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు.

బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే రేవూరి సమీక్ష.

బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే రేవూరి సమీక్ష.    అక్షర దర్బార్, పరకాల: పరకాల పట్టణంలోని అంగడి మైదానం, దామెర చెరువు వద్ద జరుగనున్న బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లను...
Read More...
బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే రేవూరి సమీక్ష.