వ‌రంగల్ డీటీవోపై వేటు.. ర‌వాణాశాఖ‌లో క‌ల‌క‌లం

వ‌రంగల్ డీటీవోపై వేటు.. ర‌వాణాశాఖ‌లో క‌ల‌క‌లం

  • నిన్న డీటీసీ శ్రీనివాస్ ఇళ్లల్లో ఏసీబీ రైడ్స్‌.. అరెస్ట్‌
  • ఇవాళ ర‌వాణాశాఖ జిల్లా అధికారి ల‌క్ష్మి బ‌దిలీ 
  • ఉత్త‌ర్వులు జారీచేసిన ఉన్న‌తాధికారులు
  • ఇన్‌చార్జి డీటీవోగా ఎంవీఐ శోభన్ బాబుకు అదనపు బాధ్యతలు 
  • అవినీతికి అడ్డాగా వరంగల్ రవాణాశాఖ కార్యాలయం !
  • దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగిన ప్ర‌భుత్వం..

అక్ష‌ర‌ద‌ర్బార్‌, వ‌రంగ‌ల్‌: వరంగల్ రవాణాశాఖ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే రవాణా శాఖ కార్యాలయ పక్షాళ‌నపై ప్రభుత్వం దృష్టి సారించింది. నిన్న డీటీసీ పుప్పాల శ్రీనివాస్ ఇళ్లల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి కోట్లల్లో అక్రమస్తులు కూడ‌పెట్టినట్లు గుర్తించి ఆయ‌న్ను అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న మ‌ర‌వ‌క ముందే ఇవాళ వ‌రంగ‌ల్ డీటీవోగా పని చేస్తున్న లక్ష్మీపై వేటు ప‌డింది. హైదరాబాద్‌లోని కమిషనర్ కార్యాలయంలో ఆమెను రిపోర్టు చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. విధుల్లో నిర్లక్ష్యం వ‌హించ‌డంతోపాటు అవినీతి ఆరోపణల నేప‌థ్యంలో డీటీవోపై వేటు వేసినట్లు తెలుస్తోంది. గతంలో డీటీవో లక్ష్మికి వరంగల్ కలెక్టర్ నుంచి షోకాస్ నోటీసులు సైతం అందాయి. తాజాగా ఆమెను డీటీవోగా తప్పిస్తూ ఉత్తర్వులు జారీకావడం కలకలం రేపుతోంది. వరంగల్ ఇన్‌చార్జి డీటీవోగా ఎంవీఐ శోభన్ బాబుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 

Tags:

రూ.1.86 కోట్ల ధాన్యం కొనుగోలు మోసం బహిర్గతం.

రూ.1.86 కోట్ల ధాన్యం కొనుగోలు మోసం బహిర్గతం.       నకిలీ రైతుల పేరుతో పెద్ద మొత్తంలో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం.      ఈఎఫ్‌టీ విచారణలో బహిర్గతం    అక్షర దర్బార్, శాయంపేట:...
Read More...
రూ.1.86 కోట్ల ధాన్యం కొనుగోలు మోసం బహిర్గతం.

వాట్సాప్ దక్కకపోతే ఏంటి? స్వదేశీ 'అరట్టై' వాడండి! - సుప్రీం కోర్టు సూచన

  అంతర్జాతీయ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు పోటీగా వచ్చిన స్వదేశీ యాప్ 'అరట్టై' (Arattai) పేరు ప్రస్తుతం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోనూ వినిపించింది. తన వాట్సాప్
వార్తలు  వరంగల్ 
Read More...
వాట్సాప్ దక్కకపోతే ఏంటి? స్వదేశీ 'అరట్టై' వాడండి! - సుప్రీం కోర్టు సూచన

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు.

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు.    తెలంగాణ కోసం తన ఇల్లు ఉద్యమానికి ఇచ్చిన త్యాగి. పద్మశాలి ఐక్యతకు సహకార సంఘాల మార్గదర్శకుడు.      డాక్టర్   అక్షర...
Read More...
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు.

బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే రేవూరి సమీక్ష.

బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే రేవూరి సమీక్ష.    అక్షర దర్బార్, పరకాల: పరకాల పట్టణంలోని అంగడి మైదానం, దామెర చెరువు వద్ద జరుగనున్న బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లను...
Read More...
బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే రేవూరి సమీక్ష.