మందుల పేరుతో మృత్యు వ్యాపారం

మందుల పేరుతో మృత్యు వ్యాపారం

- బాలసముద్రంలో 'చిప్రీక్స్ ఫార్మా'పై డ్రగ్ కంట్రోల్ అధికారుల మెరుపు దాడి

మందుల పేరుతో మృత్యు వ్యాపారం
- బాలసముద్రంలో 'చిప్రీక్స్ ఫార్మా'పై డ్రగ్ కంట్రోల్ అధికారుల మెరుపు దాడి
- లైసెన్స్ లేదు.. నాణ్యతా లేదు.. అర్ధరాత్రి వరకు సాగిన విస్తృత తనిఖీలు
- రూ.15 లక్షల విలువైన అక్రమ ఔషధాల నిల్వలు సీజ్
- ఫార్మసిస్ట్ సంక్షేమ సంఘం ఫిర్యాదుతో కదిలిన యంత్రాంగం

అక్షరదర్బార్, హనుమకొండ: అనుమతులు లేకుండా, నిబంధనలను తొక్కేసి మందుల పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అక్రమ నిల్వ కేంద్రం గుట్టు రట్టయింది. నగరంలోని హనుమకొండ బాలసముద్రం ప్రాంతంలో ఎలాంటి లైసెన్స్ లేకుండా నడుపుతున్న ఒక ఫార్మా నిల్వ కేంద్రంపై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు మెరుపు దాడులు జరిపి, రూ.15 లక్షల విలువైన మందులను సీజ్ చేశారు.
- నివాస గృహంలో 'అక్రమ' మందుల డెన్
బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రం సమీపంలో ఉన్న ఓ నివాస గృహంలో 'చిప్రీక్స్ ఫార్మా' డైరెక్టర్ బొబ్బల సృజన్ రెడ్డి (చెన్నారావుపేట ఉప్పరపల్లి వాసి) గత ఆరేళ్లుగా ఎలాంటి డ్రగ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం సాగిస్తున్నాడు. నాణ్యతా ప్రమాణాలు లేని (సబ్-స్టాండర్డ్) మందులను ఇక్కడ అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు ది నేషనల్ కన్జ్యుమర్ రైట్స్ కమిషన్ ఫార్మసిస్ట్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బత్తిని సత్యనారాయణ గౌడ్, కమిషన్ చైర్మన్ డాక్టర్ రాధాకృష్ణల దృష్టికి వచ్చింది. వారు వెంటనే ఆధారాలతో సహా హనుమకొండ డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ రాజ్యలక్ష్మికి ఫిర్యాదు చేశారు.
- అర్ధరాత్రి 2 గంటల వరకు ఉత్కంఠ
ఫిర్యాదు అందిన వెంటనే స్పందించిన అధికారులు డ్రగ్ ఇన్‌స్పెక్టర్లతో కలిసి రంగంలోకి దిగారు. అర్ధరాత్రి ప్రారంభమైన ఈ సోదాలు తెల్లవారుజామున 2 గంటల వరకు నిరంతరాయంగా కొనసాగాయి. ఇల్లు మొత్తం తనిఖీ చేయగా భారీగా పేరుకుపోయిన అక్రమ మందుల నిల్వలు వెలుగు చూశాయి. వీటి విలువ సుమారు రూ.15 లక్షలు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ దాడుల్లో హనుమకొండ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ కిరణ్ కుమార్, వరంగల్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఉపేందర్, భూపాలపల్లి డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పల్లవిలు పాల్గొన్నారు.
- ప్రజారోగ్యంతో ఆడుకుంటే ఊరుకోం
లైసెన్స్ లేకుండా మందులు అమ్మడం, నిబంధనలకు విరుద్ధంగా సబ్-స్టాండర్డ్ ఔషధాలను నిల్వ ఉంచడం చట్టరీత్యా తీవ్రమైన నేరమని డ్రగ్ కంట్రోల్ అధికారులు స్పష్టం చేశారు. నిందితులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సకాలంలో స్పందించి అక్రమ దందాను అరికట్టిన డ్రగ్ కంట్రోల్ అధికారులను, ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చిన సత్యనారాయణ గౌడ్, డాక్టర్ రాధాకృష్ణలను పలువురు అభినందించారు.

Tags:
మీకు నచ్చే మరిన్ని

మందుల పేరుతో మృత్యు వ్యాపారం

- బాలసముద్రంలో 'చిప్రీక్స్ ఫార్మా'పై డ్రగ్ కంట్రోల్ అధికారుల మెరుపు దాడి
వార్తలు 
Read More...
మందుల పేరుతో మృత్యు వ్యాపారం

గవర్నర్‌ కోటాలో ప్రొఫెసర్‌ గడ్డం భాస్కర్‌కు అవకాశం ఇవ్వాలి

గవర్నర్‌ కోటాలో ప్రొఫెసర్‌ గడ్డం భాస్కర్‌కు అవకాశం ఇవ్వాలి   సీఎం రేవంత్‌రెడ్డికి బీసీ సంఘాలు, పద్మశాలీ నాయకుల విజ్ఞప్తి అక్షరదర్బార్, పరకాల: శాసనమండలిలో పద్మశాలీ సమాజానికి సముచిత...
Read More...
గవర్నర్‌ కోటాలో ప్రొఫెసర్‌ గడ్డం భాస్కర్‌కు అవకాశం ఇవ్వాలి

దుగ్గొండిలో విద్యార్థులకు అందని అల్పాహారం!

దుగ్గొండిలో విద్యార్థులకు అందని అల్పాహారం! ఉదయం 10 గంటలు దాటినా పంపిణీ శూన్యం అధికారుల నిర్లక్ష్యంపై ఏబీఎస్ఎఫ్ ఆగ్రహం అక్షరదర్బార్,దుగ్గొండి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు...
Read More...
దుగ్గొండిలో విద్యార్థులకు అందని అల్పాహారం!

పత్తికి మద్దతు ధర కల్పించాలి

పత్తికి మద్దతు ధర కల్పించాలి ఏనుమాముల మార్కెట్‌లో ధరల తగ్గింపుపై విచారణ జరపాలి    వరికెల కిషన్ రావు అక్షరదర్బార్, హనుమకొండ: రైతులు పండించిన పత్తికి మద్దతు ధర...
Read More...
పత్తికి మద్దతు ధర కల్పించాలి

వరికి ప్రత్యామ్నాయ పంటలే మేలు

  రైతులు వ్యవసాయ భూముల సంరక్షణ, నేల ఆరోగ్యం, నీటి వనరుల పరిరక్షణతో పాటు స్థిరమైన వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని అదనపు కలెక్టర్ రవి సూచించారు. హసన్‌పర్తి
వరంగల్ 
Read More...
వరికి ప్రత్యామ్నాయ పంటలే మేలు