గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ గడ్డం భాస్కర్‌కు అవకాశం ఇవ్వాలి
గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ గడ్డం భాస్కర్‌కు అవకాశం ఇవ్వాలి
సీఎం రేవంత్‌రెడ్డికి బీసీ సంఘాలు, పద్మశాలీ నాయకుల విజ్ఞప్తి
అక్షరదర్బార్, పరకాల:
శాసనమండలిలో పద్మశాలీ సమాజానికి సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని బీసీ సంఘాల ప్రతినిధులు, పద్మశాలీ నాయకులు, మేధావులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం పరకాల పట్టణంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. కాకతీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు, ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ గడ్డం భాస్కర్‌కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. విద్యా, పరిశోధనా రంగాల్లో విశేష అనుభవం కలిగిన ఆయన చేనేత రంగ సమస్యలపై కూడా పరిశోధనలు చేశారని తెలిపారు. నేతన్నల సమస్యలు, చేనేత సహకార సంఘాల బలోపేతం, బీసీల అభ్యున్నతి కోసం శాసనమండలిలో సమర్థంగా గళం వినిపించగలరని పేర్కొన్నారు. పద్మశాలీ సమాజానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ మత్స్య పారిశ్రామిక సంఘం అధ్యక్షుడు సాదు రఘువీర్, మాజీ వైస్ ప్రిన్సిపల్ నల్లల బిక్షపతి, బీసీ నాయకులు గునికంటి రవి, ఎం.ఎన్. మూర్తి, శ్రీకాంత్, బైరి రవి, సాయికుమార్, సునీల్, జనార్దన్, తాళ్లపల్లి రామస్వామి తదితరులు పాల్గొన్నారు.