ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి

ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి

- ఏకశిలా విద్యాసంస్థల చైర్మన్ గౌరు తిరుపతిరెడ్డి

ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి 
- నా సేవా పరిధి మాత్రమే మారింది.. లక్ష్యం కాదు
- కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన ఏకశిలా విద్యాసంస్థల చైర్మన్ గౌరు తిరుపతిరెడ్డి
- హనుమకొండ జన చైతన్య సభలో ప్రసంగం

అక్షరదర్బార్, హనుమకొండ:
"ఇన్నాళ్లూ విద్యార్థుల భవిష్యత్తు కోసం పనిచేశాను.. ఇకపై ప్రజల భవిష్యత్తు కోసం పనిచేస్తాను. నా ఆలోచన, ఆశయం, సమాజానికి సేవ చేయాలనే తపన ఏమాత్రం మారలేదు. మారుతున్నది కేవలం నా సేవా పరిధి మాత్రమే" అని ప్రముఖ విద్యావేత్త, ఏకశిలా విద్యాసంస్థల చైర్మన్ గౌరు తిరుపతిరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం హనుమకొండలోని కేడీసీ గ్రౌండ్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ భారీ జన చైతన్య బహిరంగ సభలో, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో తిరుపతిరెడ్డి మాట్లాడుతూ, విద్యారంగంలో తాను సంపాదించిన 25 ఏళ్ల అనుభవాన్ని ఇకపై ప్రజాసేవకు మరింత విస్తృతంగా వినియోగించాలనే సంకల్పంతోనే రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయాల్లోకి రావడం పదవుల కోసం తీసుకున్న నిర్ణయం కాదని, ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను తెలుసుకుని, పరిష్కారానికి కృషి చేయడమే తన ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
- రైతు బిడ్డగా మొదలై.. విద్యావేత్తగా ఎదిగి..
సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించిన తనకు కష్టపడే తత్వం, పట్టుదలే పెట్టుబడి అని తిరుపతిరెడ్డి గుర్తుచేసుకున్నారు. చిన్నప్పటి నుంచే రాజకీయాలు, సమాజ సేవపై ఆసక్తి ఉన్నప్పటికీ, ముందుగా తన కాళ్లపై తాను నిలబడి సమాజానికి ఉపయోగపడే స్థాయికి ఎదగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. వరంగల్ గడ్డపై ఏకశిలా విద్యాసంస్థలకు పునాది వేసినప్పుడు తన వద్ద భారీ ఆర్థిక వనరులు లేకపోయినా, నాణ్యమైన విద్య అందించాలనే బలమైన సంకల్పం ఉండేదన్నారు. విద్యను వ్యాపారంగా కాకుండా సేవగా భావించడం వల్లే ఎన్నో సవాళ్లను అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నానని వివరించారు.
- 24 విద్యాసంస్థలు.. 16 వేల మంది విద్యార్థులు
గత 25 ఏళ్ల కృషి ఫలితంగా నేడు పది జిల్లాల్లో 24 విద్యాసంస్థల ద్వారా 16 వేల మందికి పైగా విద్యార్థులకు విద్య అందిస్తున్నామని, తన జీవితంలో ఇంతకంటే గొప్ప సంతృప్తి మరొకటి లేదని తిరుపతిరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. అయితే సమాజ అభివృద్ధి కేవలం విద్యతోనే పూర్తికాదని, ఆరోగ్యం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాలు కూడా అత్యంత ముఖ్యమని అభిప్రాయపడ్డారు. విద్యాసంస్థల నిర్వహణలో తాను నేర్చుకున్న అనుభవం, సమస్యలను పరిష్కరించే తత్వం ఇకపై ప్రజాసేవలో ఎంతో ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
- కేసీఆర్ పోరాటం.. కేటీఆర్ నాయకత్వమే స్ఫూర్తి
తెలంగాణ రాష్ట్ర సాధనలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోరాట పటిమ, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఆయనకున్న దృక్పథం తనను ఎంతగానో ప్రభావితం చేశాయని తిరుపతిరెడ్డి తెలిపారు. అలాగే యువతలో నూతన ఆలోచనలకు ప్రేరణనిస్తూ, ఐటీ రంగ అభివృద్ధికి కృషి చేస్తూ, ప్రజలతో మమేకమవుతున్న కేటీఆర్ నాయకత్వం తనకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ఆయన నాయకత్వంలో పనిచేస్తూ ప్రజలకు మరింత చేరువ కావాలనే సంకల్పంతోనే బీఆర్ఎస్‌లో చేరినట్లు వెల్లడించారు. పార్టీ తనకు ఏ బాధ్యత అప్పగించినా పూర్తి నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేస్తానని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని సభాముఖంగా హామీ ఇచ్చారు.

Tags:
మీకు నచ్చే మరిన్ని

ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి

- ఏకశిలా విద్యాసంస్థల చైర్మన్ గౌరు తిరుపతిరెడ్డి
రాజకీయం 
Read More...
ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి

కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ షురూ

- హనుమకొండ జన చైతన్య సభలో కేటీఆర్
రాజకీయం 
Read More...
కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ షురూ

మందుల పేరుతో మృత్యు వ్యాపారం

- బాలసముద్రంలో 'చిప్రీక్స్ ఫార్మా'పై డ్రగ్ కంట్రోల్ అధికారుల మెరుపు దాడి
వార్తలు 
Read More...
మందుల పేరుతో మృత్యు వ్యాపారం

గవర్నర్‌ కోటాలో ప్రొఫెసర్‌ గడ్డం భాస్కర్‌కు అవకాశం ఇవ్వాలి

గవర్నర్‌ కోటాలో ప్రొఫెసర్‌ గడ్డం భాస్కర్‌కు అవకాశం ఇవ్వాలి   సీఎం రేవంత్‌రెడ్డికి బీసీ సంఘాలు, పద్మశాలీ నాయకుల విజ్ఞప్తి అక్షరదర్బార్, పరకాల: శాసనమండలిలో పద్మశాలీ సమాజానికి సముచిత...
Read More...
గవర్నర్‌ కోటాలో ప్రొఫెసర్‌ గడ్డం భాస్కర్‌కు అవకాశం ఇవ్వాలి

దుగ్గొండిలో విద్యార్థులకు అందని అల్పాహారం!

దుగ్గొండిలో విద్యార్థులకు అందని అల్పాహారం! ఉదయం 10 గంటలు దాటినా పంపిణీ శూన్యం అధికారుల నిర్లక్ష్యంపై ఏబీఎస్ఎఫ్ ఆగ్రహం అక్షరదర్బార్,దుగ్గొండి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు...
Read More...
దుగ్గొండిలో విద్యార్థులకు అందని అల్పాహారం!