బిగ్ బ్రేకింగ్.. ఎస్సై మృతదేహం లభ్యం

  • చెరువులో గల్లంతైన మహిళా కానిస్టేబుల్‌ శ్రుతి, కంప్యూటర్ ఆపరేటర్‌ నిఖిల్‌ మృతదేహాలు ఇప్పటికే లభ్యం 
  • కామారెడ్డి జిల్లాలో విషాదం..

కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది భిక్కనూరు మండలంలో పనిచేస్తున్న ఎస్సై సాయికుమార్, బీబీపేటలో కానిస్టేబుల్ శ్రుతితోపాటు బీబీపేట మండలానికి చెందిన కంప్యూటర్ ఆపరేటర్‌ నిఖిల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. వీరు ముగ్గురు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని 44వ నంబరు జాతీయ రహదారిపై అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు సమీపంలో కానిస్టేబుల్ శ్రుతి, నిఖిల్ ఫోన్లతోపాటు ఎస్సై కారు లభ్యం కావడం, చెరువు వద్ద చెప్పులు ఉండడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు అధికారులు అనుమానించారు. దీంతో బుధవారం రాత్రి గజఈతగాళ్లు, ఫైర్ సిబ్బంది చెరువులో మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో కానిస్టేబుల్ శ్రుతి, యువకుడు నిఖిల్ మృతదేహాలు లభ్యమయ్యాయి. గల్లంతైన ఎస్సై సాయికుమార్‌ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఇవాళ ఉదయం అతని మృతదేహం లభ్యమైంది. బుధవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి భిక్కనూరు ఎస్సై సాయికుమార్‌ ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ రావడంతో పోలీసులు ఆయన కోసం ఆరా తీయడం ప్రారంభించారు. బీబీపేట ఠాణాలో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ శ్రుతి కూడా బుధవారం ఉదయం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నట్లు స్టేషన్​లో చెప్పి బయటికి వచ్చా రు. మధ్యాహ్నమైనా తమ కుమార్తె ఇంటికి రాకపోవడంతో కానిస్టేబుల్‌ శ్రుతి తల్లిదండ్రులు బీబీపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసు స్టేషన్​ నుంచి ఎప్పుడో వెళ్లిపోయినట్లు పోలీసులు సమాచారం ఇవ్వడంతో ఆందోళనకు గురైన శ్రుతి తల్లిదండ్రులు వెంటనే అధికారులను సంప్రదించారు. ఆమె ఫోన్​ సిగ్నల్‌ ఆధారంగా సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డి చెరువు వద్ద ఉన్నట్లు పోలీసులు గుర్తించగా.. హూటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో చెరువు వద్ద కానిస్టేబుల్‌ శ్రుతి, బీబీపేటకు చెందిన నిఖిల్‌ మొబైల్​ ఫోన్లు దొరకగా భిక్కనూరు ఎస్సై సాయికుమార్‌కు చెందిన కారు, పాదరక్షలు కనిపించాయి. దీంతో గాలింపు చర్యలు చేపట్టగా మహిళ కానిస్టేబుల్‌ శ్రుతి, నిఖిల్‌ మృతదేహాలు లభ్యమయ్యాయి. ఎస్సై సాయికుమార్‌ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఇవాళ ఉదయం ఆయన మృతదేహం లభ్యమైంది.ఎస్సై సాయికుమార్ గతంలో బీబీపేట పోలీసు స్టేషన్​లో విధులు నిర్వహించారు. అక్కడే కానిస్టేబుల్​గా శృతి కూడా విధులు నిర్వహిస్తున్నారు. బీబీపేటకు చెందిన నిఖిల్ సొసైటీలో ఆపరేటర్​గా పనిచేస్తూనే, కంప్యూటర్లు మరమ్మతులు చేస్తుంటారని తెలుస్తోంది. అయితే ఈ ముగ్గురి మధ్య ఉన్న గొడవలేంటి? ఎస్సై, మహిళా కానిస్టేబుల్​తో పాటు యువకుడు కలిసి చెరువు వద్దకు చేరుకున్నారా? ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందన్న విషయాలు పోలీసులు వెల్లడిస్తేగానీ స్పష్టత వచ్చే అవకాశం లేదు.

Tags:

ఈరోజు సాయంత్రం హనుమకొండకు రాహుల్ గాంధీ..

  ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈరోజు నగరానికి రానున్నారు. ఈ మేరకు ఏఐసీసీ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలకు సమాచారం అందింది. ఢిల్లీ నుండి హైదారాబాద్
Read More...
ఈరోజు సాయంత్రం హనుమకొండకు రాహుల్ గాంధీ..

ఎర్రచెరువులో మృతదేహం లభ్యం

అక్షర దర్బార్, కాటారం :జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలకేంద్రంలోని ఎర్రచెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. అటుగా వెళ్లిన స్థానికులు గమనించగా పోలీసులకు సమాచారం అందించారు....
Read More...
ఎర్రచెరువులో మృతదేహం లభ్యం

ఎర్రచెరువులో మృతదేహం లభ్యం

ఎర్ర చెరువులో గుర్తుతెలియని మృతదేహం  అక్షర దర్బార్, కాటారం :జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలకేంద్రంలోని ఎర్రచెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. అటుగా వెళ్లిన స్థానికులు...
Read More...
ఎర్రచెరువులో మృతదేహం లభ్యం

వ‌రంగల్ డీటీవోపై వేటు.. ర‌వాణాశాఖ‌లో క‌ల‌క‌లం

నిన్న డీటీసీ శ్రీనివాస్ ఇళ్లల్లో ఏసీబీ రైడ్స్‌.. అరెస్ట్‌ ఇవాళ ర‌వాణాశాఖ జిల్లా అధికారి ల‌క్ష్మి బ‌దిలీ  ఉత్త‌ర్వులు జారీచేసిన ఉన్న‌తాధికారులు ఇన్‌చార్జి డీటీవోగా ఎంవీఐ శోభన్...
క్రైమ్  వరంగల్ 
Read More...
వ‌రంగల్ డీటీవోపై వేటు.. ర‌వాణాశాఖ‌లో క‌ల‌క‌లం

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వరంగల్‌ డీటీసీ అరెస్టు

  10 గంట‌ల‌కుపైగా విచారించిన ఏసీబీ.. వ‌రంగ‌ల్‌, జ‌గిత్యాల‌, హైద‌రాబాద్‌లో ఏక‌కాలంలో సోదాలు రూ. కోట్ల‌ల్లో అక్ర‌మాస్తులు గుర్తింపు విలువైన ప‌త్రాలు, ద‌స్తావేజులు స్వాధీనం ర‌వాణాశాఖ‌లో క‌ల‌క‌లం అక్ష‌ర‌ద‌ర్బార్‌,...
క్రైమ్  వరంగల్ 
Read More...
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వరంగల్‌ డీటీసీ అరెస్టు