కత్తులు, రాడ్లతో చంపారు

కత్తులు, రాడ్లతో చంపారు

-  ఇప్పటివరకు పదిమంది నిందితుల గుర్తింపు

  • ఏడుగురు నిందితుల అరెస్ట్
  • మరో ముగ్గురు నిందితుల పరార్ 
  • ఆ ముగ్గురిలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ 
  • ఏ 8 గా కొత్త హరిబాబు 
  • వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే

రాజ‌లింగ‌మూర్తి హ‌త్య కేసు ఛేదించిన పోలీసులు
ఏడుగురు నిందితుల అరెస్ట్‌.. ప‌రారీలో మ‌రో ముగ్గురు
 భూమి త‌గాదనే హ‌త్య‌కు కార‌ణం


అక్ష‌ర‌ద‌ర్బార్‌, హ‌న్మకొండ‌: రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఏడుగురు నిందితులను అరెస్టు చేసి ఈ రోజు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. అరెస్ట‌యిన వారిలో రేణిగుంట్ల సంజీవ్,  పింగిలి సేమంత్, మోరే కుమార్, కొత్తూరు కిరణ్, రేణిగుంట్ల కొమురయ్య, దాసరపు కృష్ణ, రేణిగుంట్ల సాంబయ్య ఉన్నారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, పుల్ల నరేష్, పుల్ల సురేష్ పరారీలో ఉన్నారు. ఎకరం భూమి విషయంలో తగాదానే రాజలింగమూర్తి హత్యకు కారణమ‌ని పోలీసులు వెల్లడించారు.

ఈ పత్రికా సమావేశంలో భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు, భూపాలపల్లి సిఐ నరేష్ కుమార్, చిట్యాల సిఐ మల్లేష్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, భూపాలపల్లి గణపురం, రేగొండ, టేకుమట్ల ఎస్బి లు సాంబమూర్తి, రమేష్, అశోక్, సందీప్, సుధాకర్, రాజు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.Screenshot_2025-02-23-10-34-28-005_com.google.android.apps.docsScreenshot_2025-02-23-10-34-39-590_com.google.android.apps.docs

Tags:

భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి

భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి- ఎద్దుపై దాడి చేసి చంపినట్లు గుర్తింపు - ప్రజలు ఆందోళన చెందవద్దన్న జిల్లా ఎస్పీ అక్షరదర్బార్, చిట్యాల: పెద్దపులి సంచారం భూపాలపల్లి...
Read More...
భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి

వృత్తికే మచ్చ....

వృత్తికే మచ్చ.... ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కీచక పర్వం.. విద్యార్థినిని వేధించిన అధ్యాపకుడు.. అక్షర దర్బార్, పరకాల:విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులకు మార్గదర్శకుడిగా ఉండాల్సిన అధ్యాపకుడే కీచకుడిగా...
Read More...
వృత్తికే మచ్చ....

వృత్తికే మచ్చ....

వృత్తికే మచ్చ.... ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కీచక పర్వం.. విద్యార్థినిని వేధించిన అధ్యాపకుడు.. అక్షర దర్బార్, పరకాల:విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులకు మార్గదర్శకుడిగా ఉండాల్సిన అధ్యాపకుడే కీచకుడిగా...
Read More...
వృత్తికే మచ్చ....

సొంత గూటికి నడికూడ మాజీ జడ్పిటిసి, మాజీ ఎంపిటిసి

సొంత గూటికి నడికూడ మాజీ జడ్పిటిసి, మాజీ ఎంపిటిసి బీఆర్ఎస్‌లో చేరికల జోరు ఆహ్వానించిన నాగుర్ల వెంకటేశ్వర్లు అక్షర దర్బార్, పరకాల:నడికూడ మండలానికి చెందిన మాజీ...
Read More...
సొంత గూటికి నడికూడ మాజీ జడ్పిటిసి, మాజీ ఎంపిటిసి

రూ. 2.51 కోట్లు హాంఫట్.. ఎందుకో తెలుసా...

రూ. 2.51 కోట్లు హాంఫట్.. ఎందుకో తెలుసా? హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన ఇద్దరు యువ వైద్యులు సైబర్ మోసగాళ్ల వలలో పడి భారీగా రూ.2.51 కోట్లు...
Read More...
రూ. 2.51 కోట్లు హాంఫట్.. ఎందుకో తెలుసా...