కానిస్టేబుళ్ల ఆత్మహత్య

కానిస్టేబుళ్ల ఆత్మహత్య

  • ఇద్దరు పోలీసు కానిస్టేబుల్స్ సూసైడ్
  • మృతుల్లో ఒకరు హెడ్ కానిస్టేబుల్ 
  • మరొకరు బెటాలియన్ కానిస్టేబుల్ 
  • మెదక్, సిద్దిపేట జిల్లాల్లో విషాదం

ఇద్దరు కానిస్టేబుళ్లు ఆత్మహత్య
- మృతుల్లో ఒకరు హెడ్ కానిస్టేబుల్, మరొకరు కానిస్టేబుల్ 
- మెదక్, సిద్దిపేట జిల్లాల్లో విషాదం

అక్షరదర్బార్, మెదక్:
వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల్లో ఒకరు హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్, మరొకరు 17వ బెటాలియన్ కానిస్టేబుల్ బాలకృష్ణ. వివరాల్లోకి వెళితే... ఆదివారం ఉదయం మెదక్ జిల్లా కొల్చారం పోలీస్ స్టేషన్ వద్ద హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తెల్లవారుజామున వాకింగ్ కోసం ఇంటి నుంచి పోలీసు స్టేషన్ కు వచ్చిన సాయికుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడే ముందు సాయికుమార్ తన కుమార్తెకు ఫోన్ చేశారు. హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్ బలవన్మరణంపై మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి విచారణ చేపట్టారు. 

సిద్దిపేట వద్ద 17వ బెటాలియన్ కానిస్టేబుల్ బాలకృష్ణ కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వీరిలో కానిస్టేబుల్ బాలకృష్ణ చనిపోయాడు. ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో కానిస్టేబుల్ బాలకృష్ణ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇంటి కోసం బాలకృష్ణ అప్పు చేసినట్లు సమాచారం. హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఆత్మహత్యతో మెదక్, సిద్దిపేట జిల్లాల్లో విషాదం అలుముకుంది.IMG-20241229-WA0015

Tags:

గురుకులంలో ‘పాము’ కలకలం!

గురుకులంలో ‘పాము’ కలకలం! పాము నుండి తప్పించుకునే క్రమంలో గాయపడ్డ ఐదో తరగతి విద్యార్థిని..  పాములు, కోతుల సంచారంపై తల్లిదండ్రుల ఆందోళన అక్షరదర్బార్, ఇనుగుర్తి: ఇనుగుర్తి సాంఘిక...
Read More...
గురుకులంలో ‘పాము’ కలకలం!

ఊరి మధ్యలో రైస్‌మిల్లు వద్దంటూ రోడ్డెక్కిన ప్రజలు!

ఊరి మధ్యలో రైస్‌మిల్లు వద్దంటూ రోడ్డెక్కిన ప్రజలు! ఆవాసాల మధ్య నిర్మాణంపై తీవ్ర అభ్యంతరం..   పనులు నిలిపివేయాలంటూ గ్రామసభలో వినతి.. చిన్ననాగారం–ఎర్రబెల్లిగూడెం రహదారిపై బైఠాయింపు అక్షరదర్బార్, ఇనుగుర్తి:...
Read More...
ఊరి మధ్యలో రైస్‌మిల్లు వద్దంటూ రోడ్డెక్కిన ప్రజలు!

తలొంచి బతకడం తెలియదు

- డిజిటల్ మీడియా ప్రతినిధుల చిట్ చాట్ లో తెలంగాణ ఉద్యమకారుల ‘ఐక్యవేదిక’ రాష్ట్ర చైర్మన్ గుడిమళ్ళ రవికుమార్
రాజకీయం 
Read More...
తలొంచి బతకడం తెలియదు

చైర్మన్‌గా కొలుగూరి రాజేశ్వరరావు ప్రమాణ స్వీకారం.

కుంకుమేశ్వర ఆలయ అభివృద్ధికి కృషి చైర్మన్‌గా కొలుగూరి రాజేశ్వరరావు ప్రమాణ స్వీకారం..   సేవా దృక్పథంతో పనిచేయాలి  ఎమ్మెల్యే రేవూరి అక్షరదర్బార్,పరకాల: పరకాల పట్టణంలోని కుంకుమేశ్వర స్వామి దేవస్థానం...
Read More...
చైర్మన్‌గా కొలుగూరి రాజేశ్వరరావు ప్రమాణ స్వీకారం.

నా పనితీరే నా బలం

- భూపాలపల్లే నా కుటుంబం.. అభివృద్ధే నా శ్వాస! 
రాజకీయం 
Read More...
నా పనితీరే నా బలం