కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే తిరగ పడుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే తిరగ పడుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే తిరగ పడుతున్నారు.
 
భూపాలపల్లి నియోజకవర్గం తెలంగాణ ఉద్యమానికి బిఆర్ఎస్ పార్టీకి పట్టుకొమ్మ.
 
భూపాలపల్లిలో బిఆర్ఎస్ పార్టీని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుంది.
 
బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు సిరికొండ ప్రశాంత్.
 
అక్షర దర్బార్, శాయంపేట 
 
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయనందుకు సొంత పార్టీ కార్యకర్తలే తిరగబడుతున్నారని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు సిరికొండ ప్రశాంత్ అన్నారు. మండల కేంద్రంలోని  ప్రగతి సింగారం గ్రామంలో సిరికొండ ప్రశాంత్ విలేకరుల మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మీద రాష్ట్రస్థాయిలో వ్యతిరేకత ఉందని రాహుల్ గాంధీని, సోనియా గాంధీని ప్రసన్నం చేసుకోవాలనే తప్ప ప్రజలకు ప్రసన్నం చేసుకోవాలని లేదని, వ్యక్తిగత లాభం, గాంధీ కుటుంబం లాభం తప్ప ప్రజల లాభం చూడటం లేదని జనాలకు మంచి చేయాలని సోయి కూడా ఉండటం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నీ ప్రభుత్వం నెరవేర్చాలని లేనిపక్షంలో ప్రజాక్షేత్రంలో ఎండగడతామని అన్నారు.
 
భూపాలపల్లిలో బిఆర్ఎస్ పార్టీని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుంది.
 
భూపాలపల్లి నియోజకవర్గం అంటే తెలంగాణ ఉద్యమానికి బిఆర్ఎస్ పార్టీకి పట్టుకొమ్మ అని అధికారం పోయిందని మంచి రోజులు వస్తాయని కార్యకర్తలను కాపాడుకోవాలి కానీ ఫోన్ చేసి మరి వేరే పార్టీలోకి వెళ్లిపోతుంటే భూపాలపల్లిలో టిఆర్ఎస్ పార్టీని నాశనం చేయాలని కొందరు నాయకులు ఉన్నారని, బిఆర్ఎస్ పార్టీని సర్వనాశనం చేసి ఈ పార్టీ నుంచి వెళ్లిపోయి వేరే పార్టీలోకి పోటీ చేయాలి. ఈ పార్టీని పొమ్మనకుండా పొగబెట్టాలి బలమైన పార్టీని నిర్వీణ్యం చేయాలని కొందరు నాయకులు ఉన్నారని విమర్శించారు. ఎవరెన్ని కుతంత్రాలు చేసినా భూపాలపల్లికి సిరికొండ మధుసూదనా చారి వస్తాడని భూపాలపల్లికి రావద్దు అంటూ ఎవరు ఆంక్షలు పెట్టలేదని పెట్టరు కూడా అని అన్నారు. బిఆర్ఎస్ పార్టీతో మాతో 20 ఏళ్ల అనుబంధం ఉందని ఈ పార్టీతోనే ఉంటామని ఈ పార్టీలోనే చచ్చిపోతామని అన్నారు. బిఆర్ఎస్ పార్టీని భూపాలపల్లిలో ఆఖరి రక్తపు బొట్టు వరకు కాపాడుకుంటామని భూపాలపల్లిని సిరికొండ మధుసూదన చారికి విడదీసి చూడలేమని అన్నారు. శత్రువుల పాతికలు పారిచ్చేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు దూలం నాగరాజు, మాజీ ఎంపీటీసీ బగ్గిరమేష్, నాయకులు పోతూ రమణారెడ్డి, రాకేష్ సుమన్ తదితరులు పాల్గొన్నారు.IMG-20250128-WA1212
Tags:

అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల ఉక్కుపాదం

అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల ఉక్కుపాదం నడికూడ గుట్టపై నిర్మాణాల కూల్చివేత ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలురెవెన్యూ అధికారులు అక్షరదర్బార్,నడికూడ: నడికూడ మండలంలోని నడికూడ...
Read More...
అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల ఉక్కుపాదం

వృద్ధురాలి హత్య.. దోపిడీ కేసులో నిందితుడి అరెస్ట్

వృద్ధురాలి హత్య.. దోపిడీ కేసులో నిందితుడి అరెస్ట్ పైకప్పు ద్వారా ఇంట్లోకి ప్రవేశం..   కేకలు వేయడంతో ఇనుపరాడ్‌తో దాడి రెండు బంగారు పుస్తెలు, రక్తపు మరకల దుస్తులు...
Read More...
వృద్ధురాలి హత్య.. దోపిడీ కేసులో నిందితుడి అరెస్ట్

సోషల్‌ మీడియా మాట నమ్మి మందులు వాడొద్దు

సోషల్‌ మీడియా మాట నమ్మి మందులు వాడొద్దు రసాయన మందులతో పంటలకు నష్టం మాజీ తెలంగాణ రైతు రుణ విమోచన కమిటీ చైర్మన్‌ నాగూర్ల అక్షరదర్బార్,పరకాల: పంటల్లో...
Read More...
సోషల్‌ మీడియా మాట నమ్మి మందులు వాడొద్దు

గురుకులంలో ‘పాము’ కలకలం!

గురుకులంలో ‘పాము’ కలకలం! పాము నుండి తప్పించుకునే క్రమంలో గాయపడ్డ ఐదో తరగతి విద్యార్థిని..  పాములు, కోతుల సంచారంపై తల్లిదండ్రుల ఆందోళన అక్షరదర్బార్, ఇనుగుర్తి: ఇనుగుర్తి సాంఘిక...
Read More...
గురుకులంలో ‘పాము’ కలకలం!

ఊరి మధ్యలో రైస్‌మిల్లు వద్దంటూ రోడ్డెక్కిన ప్రజలు!

ఊరి మధ్యలో రైస్‌మిల్లు వద్దంటూ రోడ్డెక్కిన ప్రజలు! ఆవాసాల మధ్య నిర్మాణంపై తీవ్ర అభ్యంతరం..   పనులు నిలిపివేయాలంటూ గ్రామసభలో వినతి.. చిన్ననాగారం–ఎర్రబెల్లిగూడెం రహదారిపై బైఠాయింపు అక్షరదర్బార్, ఇనుగుర్తి:...
Read More...
ఊరి మధ్యలో రైస్‌మిల్లు వద్దంటూ రోడ్డెక్కిన ప్రజలు!