ఏసీబీ వలలో ఎస్సై, పీసీ

ఏసీబీ వలలో ఎస్సై, పీసీ

  • ఓ వ్యాపారి నుంచి రూ.3 లక్షల లంచం డిమాండ్
  • రూ.1.30 లక్షలు ఇచ్చేందుకు వ్యాపారి యాక్సెప్ట్ 
  • రూ.లక్ష తీసుకుంటూ పట్టుబడిన ఎస్సై, పీసీ 
  • సూర్యాపేట జిల్లాలో ఘటన 

అక్షరదర్బార్,సూర్యాపేట:
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు లంచావతారాలపై నిఘా పెట్టి దాడులకు దిగుతున్నారు. పని కోసం లంచం తీసుకుంటున్న ప్రభుత్వ శాఖల్లోని అధికారులు, ఉద్యోగులను పట్టుకుంటున్నారు. తాజాగా మంగళవారం సూర్యాపేట జిల్లాలో వల వేశారు. ఓ పోలీసు ఎస్ఐ, కానిస్టేబుల్ ఏసీబీ అధికారుల వలకు చిక్కారు. రూ.లక్ష లంచం తీసుకుంటుండగా తిరుమలగిరి పోలీస్ స్టేషన్ ఎస్ఐ సురేష్, కానిస్టేబుల్ నాగరాజును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)రైస్ కేసులో ఎస్సై సురేష్ ఓ వ్యాపారిని రూ.3 లక్షలు డిమాండ్ చేసినట్లు తెలిసింది. అయితే రూ.1.30 లక్షలు ఇచ్చేందుకు వ్యాపారి అంగీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రూ.లక్ష లంచం తీసుకుంటూ ఎస్సై సురేష్, కానిస్టేబుల్ నాగరాజు ఏసీబీ అధికారులకు పట్టుబడినట్లు తెలిసింది. ఈ ఘటన పోలీసు శాఖలో కలకలం రేపింది.

Tags:

కసితో ఎమ్మెల్యేనయ్య

- బిజినెస్ మ్యాన్ ను కావాలనే కాయిస్ ఉండే నాకు - మా అన్న ఎమ్మెల్యే కావాలన్న టార్గెట్ ఉండేది - అయితే ఒక్క అవమానం నన్ను...
రాజకీయం 
Read More...
కసితో ఎమ్మెల్యేనయ్య

రేవూరి, సీఎంపై వ్యాఖ్యలు సరికాదు

రేవూరి, సీఎంపై వ్యాఖ్యలు సరికాదు - కొండా సుస్మిత పటేల్‌ తీరుపై కాంగ్రెస్‌ నేతల మండిపాటు.. - క్షమాపణ చెప్పాలని డిమాండ్ - ఇక్కడ మంత్రి సుష్మతనా...
Read More...
రేవూరి, సీఎంపై వ్యాఖ్యలు సరికాదు

పరకాల కాంగ్రెస్ లో పొలిటికల్ సెగ

- రేవంత్ వ్యాఖ్యలకు కొండా సుస్మిత కౌంటర్- డైపర్లు వేసుకునే వ్యక్తికి మళ్లీ టికెట్ ఇస్తారా? అని ప్రశ్న- “పరకాల నాదే.. టికెట్ ఇచ్చేది...
రాజకీయం 
Read More...
పరకాల కాంగ్రెస్ లో పొలిటికల్ సెగ

వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా

- రిజర్వేషన్లు మారితే నా సతీమణి బరిలో ఉంటారు- పార్టీ నిర్ణయిస్తే మేయర్ గా బరిలోకి.. - నేను పార్టీ విధేయుడిని.. పార్టీ నిర్ణయమే శిరోధార్యం...
రాజకీయం 
Read More...
వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా

పెద్ది విగ్రహం తొలగింపు

- నర్సంపేటలో భారీగా పోలీసుల మోహరింపు.. ఉద్రిక్తత- బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్ట్
రాజకీయం 
Read More...
పెద్ది విగ్రహం తొలగింపు