భూతగాదాలో మరొకరు బలి

భూతగాదాలో మరొకరు బలి

  • కాటారం మండలంలో దారుణ హత్య
  • వరస ఘటనల కలకలం

భూ తగాదాలో మరో ప్రాణం బలి 

*కాటారం మండలం లో వరుస ఘటనల కలకలం 
*కాటారం లో వ్యక్తి దారుణ హత్య 

అక్షర దర్బార్, కాటారం : భూ తగాదాకు మరో ప్రాణం బలైన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలకేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కాటారం మండల కేంద్ర పరిధిలో ఇప్పలగూడెం కు చెందిన డోంగిరి బుచ్చయ్య (55) అనే వ్యక్తికి అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి కుటుంబం తో గత కొన్నేళ్లుగా భూ వివాదం నడుస్తుంది.ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఇరు కుటుంబాల మధ్య వివాదం చెలరేగగా మాట మాట పెరిగి కర్రలతో దాడిచేసుకున్నట్లుగా సమాచారం. దీంతో బుచ్చయ్య తలపై పెద్ద దుంగతో బాదగా అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు. కాగా కాటారం మండలంలో ఇటీవల భూ వివాదాలతో వరుసహత్య లు చోటుచేసుకోవడం మండల వ్యాప్తంగా  కలకలం సృష్టిస్తుంది. కొన్ని రోజుల క్రితం కాటారం మండలంలోని దేవరంపల్లి గ్రామానికి చెందిన మారుపాక సారయ్య ను సొంత తమ్ముడి కుటుంబీకులే హత్య చేసిన దారుణ ఘటన విషయం తెలిసిందే.

Tags:

రామప్పను రక్షించుకుందాం

- డిజిటల్ మీడియా ప్రతినిధుల చిట్ చాట్ లో కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ సభ్యుడు ప్రొఫెసర్ ఎం పాండురంగారావు
వార్తలు 
Read More...
రామప్పను రక్షించుకుందాం

అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల ఉక్కుపాదం

అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల ఉక్కుపాదం నడికూడ గుట్టపై నిర్మాణాల కూల్చివేత ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలురెవెన్యూ అధికారులు అక్షరదర్బార్,నడికూడ: నడికూడ మండలంలోని నడికూడ...
Read More...
అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల ఉక్కుపాదం

వృద్ధురాలి హత్య.. దోపిడీ కేసులో నిందితుడి అరెస్ట్

వృద్ధురాలి హత్య.. దోపిడీ కేసులో నిందితుడి అరెస్ట్ పైకప్పు ద్వారా ఇంట్లోకి ప్రవేశం..   కేకలు వేయడంతో ఇనుపరాడ్‌తో దాడి రెండు బంగారు పుస్తెలు, రక్తపు మరకల దుస్తులు...
Read More...
వృద్ధురాలి హత్య.. దోపిడీ కేసులో నిందితుడి అరెస్ట్

సోషల్‌ మీడియా మాట నమ్మి మందులు వాడొద్దు

సోషల్‌ మీడియా మాట నమ్మి మందులు వాడొద్దు రసాయన మందులతో పంటలకు నష్టం మాజీ తెలంగాణ రైతు రుణ విమోచన కమిటీ చైర్మన్‌ నాగూర్ల అక్షరదర్బార్,పరకాల: పంటల్లో...
Read More...
సోషల్‌ మీడియా మాట నమ్మి మందులు వాడొద్దు

గురుకులంలో ‘పాము’ కలకలం!

గురుకులంలో ‘పాము’ కలకలం! పాము నుండి తప్పించుకునే క్రమంలో గాయపడ్డ ఐదో తరగతి విద్యార్థిని..  పాములు, కోతుల సంచారంపై తల్లిదండ్రుల ఆందోళన అక్షరదర్బార్, ఇనుగుర్తి: ఇనుగుర్తి సాంఘిక...
Read More...
గురుకులంలో ‘పాము’ కలకలం!