వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం

వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం

వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం

నీటి వనరులను సంరక్షిస్తూ ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించాలి 
అదనపు కలెక్టర్ రవి

అక్షరదర్బార్,హసన్‌పర్తి:
 రైతులు వరి సాగుకు ప్రత్యామ్నాయంగా తక్కువ నీటితో పండే ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ రవి సూచించారు. భూసారాన్ని కాపాడుకుంటూ, నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని పేర్కొన్నారు. హసన్‌పర్తి మండలం నాగారం గ్రామంలోని రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి అనురాధ ఆధ్వర్యంలో, గ్రామ సర్పంచ్ సందరాజు లావణ్య అధ్యక్షతన ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకుని, నేల స్వభావానికి అనుగుణంగా సమతుల్య ఎరువులు వినియోగించాలని సూచించారు. నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవడంతో పాటు పంటల మార్పిడి, చీడపీడలు, తెగుళ్ల నివారణపై అవగాహన కలిగి ఉండాలన్నారు. యాసంగి పంటలపై ఎల్‌నినో ప్రభావం, భూగర్భ జలాల తగ్గుదల, విద్యుత్ అంతరాయాలను దృష్టిలో ఉంచుకుని ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు.

పెట్టుబడి తగ్గించి దిగుబడులు పెంచాలి

జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ చంద్ర మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించడం ద్వారా పెట్టుబడి ఖర్చులు తగ్గించుకుని అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. ప్రకృతి వనరులను సంరక్షించి భవిష్యత్ తరాలకు సారవంతమైన భూమిని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. పంట కొయ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ కాల్చవద్దని సూచించారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని రైతు సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

తక్కువ నీటితో పండే పంటలపై దృష్టి

జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ నీటి లభ్యతను బట్టి ఆయిల్‌పామ్, కూరగాయల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. వరికి ప్రత్యామ్నాయంగా వేరుశెనగ, పొద్దుతిరుగుడు, పెసర, మినుము, అలసంద, జొన్నతో పాటు కూరగాయల పంటలను సాగు చేయాలని వ్యవసాయ అధికారులు రైతులకు సూచించారు. కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు ఆది రెడ్డి, టీకేవీకే శాస్త్రవేత్త నర్సయ్య, డీఎం టీజీ ఆయిల్‌ఫెడ్ శంకర్, మండల వ్యవసాయ అధికారి అనురాధ, ఏఈ తరుణ్, వీఏఎస్‌లు దీపిక, రమేష్, ఆత్మకూరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తంగళ్లపెల్లి తిరుపతి, సర్పంచ్ సందరాజు లావణ్య, వ్యవసాయ విస్తరణ అధికారులు శైలజ, సాయి, స్థానిక రైతులు పాల్గొన్నారు.

Tags:

వరికి ప్రత్యామ్నాయ పంటలే మేలు

  రైతులు వ్యవసాయ భూముల సంరక్షణ, నేల ఆరోగ్యం, నీటి వనరుల పరిరక్షణతో పాటు స్థిరమైన వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని అదనపు కలెక్టర్ రవి సూచించారు. హసన్‌పర్తి
క్రైమ్  రాజకీయం  వరంగల్  ఈ-పేపర్‌ 
Read More...
వరికి ప్రత్యామ్నాయ పంటలే మేలు

వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం

వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం నీటి వనరులను సంరక్షిస్తూ ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించాలి అదనపు కలెక్టర్ రవి అక్షరదర్బార్,హసన్‌పర్తి:  రైతులు వరి పెట్టుబడి...
Read More...
వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం

నాణ్యమైన కరెంటు ఇస్తాం

- డిజిటల్ మీడియా ప్రతినిధుల చిట్ చాట్ లో టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి
వార్తలు 
Read More...
నాణ్యమైన కరెంటు ఇస్తాం

నకిలీ విత్తనాలతో నిండా మునిగాం!

నకిలీ విత్తనాలతో నిండా మునిగాం! విక్రమ్ ట్రేడర్స్‌ ఎదుట వరి రైతుల ఆందోళన..  150 ఎకరాల్లో పంట నష్టం..  పరిహారం చెల్లించాలని డిమాండ్‌ అక్షరదర్బార్,పరకాల: నకిలీ వరి...
Read More...
నకిలీ విత్తనాలతో నిండా మునిగాం!

రైస్ మిల్లర్ల ఎన్నికల్లో హైడ్రామా!

- అధికార పార్టీ జోక్యం.. 'రెండు' వర్గాల సవాల్
రాజకీయం 
Read More...
రైస్ మిల్లర్ల ఎన్నికల్లో హైడ్రామా!