నకిలీ విత్తనాలతో నిండా మునిగాం!

నకిలీ విత్తనాలతో నిండా మునిగాం!

నకిలీ విత్తనాలతో నిండా మునిగాం!

విక్రమ్ ట్రేడర్స్‌ ఎదుట వరి రైతుల ఆందోళన.. 

150 ఎకరాల్లో పంట నష్టం.. 

పరిహారం చెల్లించాలని డిమాండ్‌

అక్షరదర్బార్,పరకాల: 
నకిలీ వరి విత్తనాలతో తీవ్రంగా నష్టపోయామని ఆరోపిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. పరకాల పట్టణంలోని విక్రమ్ ట్రేడర్స్‌ ఎరువుల దుకాణం ఎదుట శాయంపేట మండలానికి చెందిన మూడు గ్రామాల రైతులు బైఠాయించి నిరసన తెలిపారు. డబ్ల్యూజీఎల్‌ 44 సిద్ధి రకం వరి విత్తనాలు సాగు చేయడంతో పంట తీవ్రంగా దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.సుమారు 150 ఎకరాల్లో ఈ విత్తనాలను సాగు చేశామని, ఎకరానికి రూ.50 వేల వరకు పెట్టుబడి పెట్టినా ఇప్పటివరకు పంట గొలుసు కూడా వేయలేదని రైతులు వాపోయారు. విత్తనాల నాణ్యత సరిగా లేకపోవడంతో పెట్టుబడులన్నీ వృథా అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు.

న్యాయం చేయాలని వేడుకోలు

నకిలీ విత్తనాలు విక్రయించిన దుకాణ యజమానిపై చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన రైతులందరికీ తగిన పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని పరిశీలించి అంచనా వేయాలని కోరారు. తమకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Tags:

నకిలీ విత్తనాలతో నిండా మునిగాం!

నకిలీ విత్తనాలతో నిండా మునిగాం! విక్రమ్ ట్రేడర్స్‌ ఎదుట వరి రైతుల ఆందోళన..  150 ఎకరాల్లో పంట నష్టం..  పరిహారం చెల్లించాలని డిమాండ్‌ అక్షరదర్బార్,పరకాల: నకిలీ వరి...
Read More...
నకిలీ విత్తనాలతో నిండా మునిగాం!

రైస్ మిల్లర్ల ఎన్నికల్లో హైడ్రామా!

- అధికార పార్టీ జోక్యం.. 'రెండు' వర్గాల సవాల్
రాజకీయం 
Read More...
రైస్ మిల్లర్ల ఎన్నికల్లో హైడ్రామా!

బతుకమ్మ వేళా.. బిందెలతో బతుకు పోరాటం!

బతుకమ్మ వేళా.. బిందెలతో బతుకు పోరాటం! 13వ వార్డులో నెల రోజులుగా నీటి కటకట..  కమిషనర్‌, కౌన్సిలర్‌ పట్టించుకోవడం లేదంటూ కాలనీవాసుల ఆగ్రహం  అక్షరదర్బార్,పరకాల: తెలంగాణ సంస్కృతికి...
Read More...
బతుకమ్మ వేళా.. బిందెలతో బతుకు పోరాటం!

ఖబడ్దార్‌ బీజేపీ నేతలారా.. 

ఖబడ్దార్‌ బీజేపీ నేతలారా..  పరకాల అభివృద్ధిపై చర్చకు సిద్ధమా! పరకాల అభివృద్ధిలో చల్లా ధర్మారెడ్డి కృషి మరువలేనిది అక్షరదర్బార్‌, పరకాల: తెలంగాణలో ప్రజలకు పరిపాలనను చేరువ చేసేందుకే...
Read More...
ఖబడ్దార్‌ బీజేపీ నేతలారా.. 

రామప్పను రక్షించుకుందాం

- డిజిటల్ మీడియా ప్రతినిధుల చిట్ చాట్ లో కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ సభ్యుడు ప్రొఫెసర్ ఎం పాండురంగారావు
వార్తలు 
Read More...
రామప్పను రక్షించుకుందాం