వరికి ప్రత్యామ్నాయ పంటలే మేలు

ఆధునిక పద్ధతులతో భూగర్భ జలాల సంరక్షణ
వరికి ప్రత్యామ్నాయ పంటలే మేలు

 రైతులు వ్యవసాయ భూముల సంరక్షణ, నేల ఆరోగ్యం, నీటి వనరుల పరిరక్షణతో పాటు స్థిరమైన వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని అదనపు కలెక్టర్ రవి సూచించారు. హసన్‌పర్తి మండలం నాగారం గ్రామంలోని రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి అనురాధ ఆధ్వర్యంలో, గ్రామ సర్పంచ్ సందరాజు లావణ్య అధ్యక్షతన ‘ఖేత్ బచావో అభియాన్ (Khet Bachao Abhiyan)’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

నాగారంలో ‘ఖేత్ బచావో అభియాన్’ 
పాల్గొన్న అదనపు కలెక్టర్ రవి
అక్షర దర్బార్​, హసన్‌పర్తి: రైతులు వ్యవసాయ భూముల సంరక్షణ, నేల ఆరోగ్యం, నీటి వనరుల పరిరక్షణతో పాటు స్థిరమైన వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని అదనపు కలెక్టర్ రవి సూచించారు. హసన్‌పర్తి మండలం నాగారం గ్రామంలోని రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి అనురాధ ఆధ్వర్యంలో, గ్రామ సర్పంచ్ సందరాజు లావణ్య అధ్యక్షతన ‘ఖేత్ బచావో అభియాన్ (Khet Bachao Abhiyan)’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రవి మాట్లాడుతూ రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకొని, నేల స్వభావానికి అనుగుణంగా సమతుల్య ఎరువులను వినియోగించాలని సూచించారు. నాణ్యమైన విత్తనాల ఎంపిక, పంటల మార్పిడి, చీడపీడలు, తెగుళ్ల నివారణపై అవగాహన కలిగి ఉండాలన్నారు. యాసంగి పంటలపై ఎల్‌నినో ప్రభావం, భూగర్భ జలాల తగ్గుదల, విద్యుత్ అంతరాయాలను దృష్టిలో ఉంచుకొని ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని రైతులకు సూచించారు.

 

పెట్టుబడి ఖర్చులు తగ్గించి అధిక దిగుబడులు సాధించాలి


జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ చంద్ర మాట్లాడుతూ రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించి పెట్టుబడి ఖర్చులను తగ్గించుకుంటూ అధిక దిగుబడులు సాధించాలని తెలిపారు. ప్రకృతి వనరులను సంరక్షిస్తూ భవిష్యత్ తరాలకు సారవంతమైన భూమిని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పంట కొయ్యలను కాల్చవద్దని, వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని రైతు సంఘాలు, స్వయం సహాయక సంఘాలు (SHG), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (PACS) సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


తక్కువ నీటితో అధిక ప్రయోజనం కలిగించే పంటలు సాగు చేయాలి

జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని ఆయిల్‌పామ్, కూరగాయల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలన్నారు. నీటి కొరతను అధిగమించేందుకు వరికి ప్రత్యామ్నాయంగా వేరుశెనగ, పొద్దుతిరుగుడు, పెసర, మినుము, అలసంద, జొన్నతో పాటు కూరగాయల పంటలను సాగు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రవి, జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ చంద్ర, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కమలాకర్ రెడ్డి, సహాయ వ్యవసాయ సంచాలకులు ఆది రెడ్డి, TKVK శాస్త్రవేత్త నర్సయ్య, DM TG Oilfed శంకర్, మండల వ్యవసాయ అధికారి అనురాధ, AE తరుణ్, VAS దీపిక, VAS రమేష్, ఆత్మకూరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తంగళ్లపెల్లి తిరుపతి, గ్రామ సర్పంచ్ సందరాజు లావణ్య, వ్యవసాయ విస్తరణ అధికారులు శైలజ, సాయి, స్థానిక రైతులు పాల్గొన్నారు.WhatsApp Image 2026-10-30 at 1.53.07 PM (1)

వరికి ప్రత్యామ్నాయ పంటలే మేలు

  రైతులు వ్యవసాయ భూముల సంరక్షణ, నేల ఆరోగ్యం, నీటి వనరుల పరిరక్షణతో పాటు స్థిరమైన వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని అదనపు కలెక్టర్ రవి సూచించారు. హసన్‌పర్తి
క్రైమ్  రాజకీయం  వరంగల్  ఈ-పేపర్‌ 
Read More...
వరికి ప్రత్యామ్నాయ పంటలే మేలు

వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం

వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం నీటి వనరులను సంరక్షిస్తూ ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించాలి అదనపు కలెక్టర్ రవి అక్షరదర్బార్,హసన్‌పర్తి:  రైతులు వరి పెట్టుబడి...
Read More...
వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం

నాణ్యమైన కరెంటు ఇస్తాం

- డిజిటల్ మీడియా ప్రతినిధుల చిట్ చాట్ లో టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి
వార్తలు 
Read More...
నాణ్యమైన కరెంటు ఇస్తాం

నకిలీ విత్తనాలతో నిండా మునిగాం!

నకిలీ విత్తనాలతో నిండా మునిగాం! విక్రమ్ ట్రేడర్స్‌ ఎదుట వరి రైతుల ఆందోళన..  150 ఎకరాల్లో పంట నష్టం..  పరిహారం చెల్లించాలని డిమాండ్‌ అక్షరదర్బార్,పరకాల: నకిలీ వరి...
Read More...
నకిలీ విత్తనాలతో నిండా మునిగాం!

రైస్ మిల్లర్ల ఎన్నికల్లో హైడ్రామా!

- అధికార పార్టీ జోక్యం.. 'రెండు' వర్గాల సవాల్
రాజకీయం 
Read More...
రైస్ మిల్లర్ల ఎన్నికల్లో హైడ్రామా!